సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కోలీవుడ్ లో అందరికీ దేవుడు. ఆయన అడగకుండా సాహాయం చేసే గొప్ప గుణమున్న వ్యక్తి. ఆయన సినిమా గనక రిలీజ్ అవుతుందంటే ఒక తమిళ నాడు మొత్తం నానా రచ్చగా మారుతుంది. ఆఫీసులు, స్కూల్స్ అన్ని సెలవులు ప్రకటిస్తాయంటేనే తలైవాకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక కోలీవుడ్ లోనే అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ గా రజనీ క్రేజ్ సంపాదించుకున్నారంటే అది ఊహించుకోవడం కష్టమే. ఇప్పటికి కోలీవుడ్ లో సూర్య, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న రజనీ ని చూస్తుంటే తలైవా ది గ్రేట్ అనాల్సిందే.

 

అయితే ఆయన గత మూడు సినిమాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. కబాలి, కాలా, పేట దారుణంగా ఫ్లాపవడంతో నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా నష్టాలొచ్చాయి. అయినా ఆయన మీద ఉన్న నమ్మకం, క్రేజ్ తో దర్బార్ సినిమాని కొన్నారు. సంక్రాంతి బరిలో దిగిన రజనీ దర్బార్ సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లో కెళ్ళిపోయింది. కానీ దర్బార్ 250 కోట్ల క్లబ్బు అంటూ ప్రచారం జరగడం మాత్రం శుద్ద అబద్దం. అయితే ప్రస్తుతం దర్బార్ బయ్యర్లు రోడ్డెక్కడమే కాదు రజినీకాంత్, మురుగదాస్, లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారట. రజినీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్ కాబట్టి అత్యధిక రేట్లకి దర్బార్ సినిమాని కొన్న బయ్యర్లు ఇప్పుడు భారీ నష్టాలతో గగ్గోలు పెడుతున్నారు. తమకి 25 కోట్ల నష్టం వచ్చింది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారట.

 

అయితే రజినీకాంత్ తన దగ్గరకి వచ్చిన బయ్యర్లని ఏమాత్రం పట్టించుకోలేదని, ఒకప్పుడు నష్టాలొస్తే కాస్త సాయం చేసిన రజిని గత కొన్నాళ్లుగా నష్టాలను పట్టించుకోవడం లేదని, అందుకే దర్బార్ బయ్యర్లకు రజిని సహాయం చెయ్యకుండా వదిలేసాడని అంటున్నారు. మరోపక్క మురుగ వెళ్లి లైకా ప్రొడక్షన్ నిర్మాతలను అడగమంటే. లైకా వారు తమకే 60 కోట్ల నష్టము వచ్చింది అని, ఇక సినిమాకి నష్ట పరిహారం ఎలా చెల్లిస్తామంటున్నారు .. అంటూ బయ్యర్లు తమ బాధను బయటపెడుతున్నారు. మరి రజిని - మురుగదాస్ భరోసా ఇవ్వడం వల్లే మేము దర్బార్ ని కొని నష్టపోయామని, తమకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ తతంగం చూస్తుంటే ఖచ్చితంగా దర్బార్ బయ్యర్లకు మొండి చెయ్యే అని అనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: