చైనాలో బీభత్సం సృష్టిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ వణికిపోతున్నాయి. అలాగే అటు చైనా ప్రభుత్వం సైతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మరీ ముఖ్యంగా చైనా టూరిజం డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా మూత పడిపోయింది అనే చెప్పాలి. చైనాకు విహార యాత్రకు వెళ్లే పొరుగుదేశ ప్రజలంతా వారి బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడంతో చైనా టూరిజం వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇకపోతే భారతదేశానికి చెందిన చైనీస్ టూరిజం ఆపరేటర్లు కూడా దీని వల్ల బాగానే దెబ్బతిన్నారు. అయితే వారు అందరితో సమానంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని మిర్చి రైతులు కూడా దాని దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు.

 

తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇటు ఆసియా దేశాలన్నింటికీ మరియు యూరోపియన్ దేశాలకు కూడా మన రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో మిర్చి ఎగుమతి అవుతూ ఉంటుంది ఇక గుంటూరు మిర్చి యొక్క డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశం నుండి ఏటా 7 వేల కోట్ల రూపాయలు ఎగుమతుల రూపంలో మిర్చి బిజినెస్ జరిగితే అందులో ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో లోనే జరుగుతుంది. అదీ కాకుండా చైనీయులకు మన దేశం లోని హాట్ మిర్చిని మాత్రమే సరఫరా చేస్తారు. అది చాలా తక్కువగా దొరికే అరుదు.

 

అయితే ఇప్పుడు కరోనా వైరస్ ఇచ్చిన దెబ్బతో చైనాలో భారత దేశం నుంచి మిర్చి ఎగుమతిని పూర్తిగా ఆపేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు అతి తీవ్రంగా నష్టపోయారు. అదీ కాకుండా చాలా ఘాటుగా ఉండే అతి అరుదైన మిర్చి రకాన్ని ఎగుమతి చేసుకునే చైనా వారు ఇప్పుడు దానిని కొనుక్కునే స్థితిలో లేనందువల్ల అది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రకాన్ని కేవలం చైనా వారు మాత్రమే ఇష్టపడతారు. ఇలా చైనా లో వచ్చిన కరోనా దెబ్బ గుంటూరులో ఉన్న మిర్చి రైతు కి తగిలిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: