ఏం మాయ చేశావే .. ఈ సినిమా ఇద్దరి జీవితాలని డిసైడ్ చేసింది. రీల్ లైఫ్ లో కాదు. రియల్ లైఫ్ లో. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య-సమంత హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక సమంత కి ఈ సినిమా డెబ్యూ అని చెప్పాలి. మొదటి సినిమాలోనే నాగ చైతన్యకి బోలెడన్ని లిప్ లాక్స్ ఇచ్చిన సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మొదటి సినిమా అయినప్పటికి ఏమాత్రం బెరుకు లేకుండా లిప్ కిస్సులతో కుర్రవాళ్ళకి మతి పోగొట్టింది. ఈ సినిమాలో చైతు-సమంతల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమా మొత్తం తమిళ వాసనలు అనిపించినప్పటికి సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలో సమంత ఇంతగా పాపులర్ అవడానికి ముఖ్య కారణం ఏం మాయ చేశావే లో సమంతకి డబ్బింగ్ చెప్పిన చిన్మయి శ్రీపాద. తన వాయిస్ లోని మ్యాజిక్ గమ్మత్తు సమంతని స్టార్ హీరోయిన్ ని చేసింది.

 

సినిమా తర్వాత చైతు సమంత కలిసి ఆటో నగర్ సూర్య, మనం సినిమాలలో నటించారు. ఆ సినిమాలలోను ఇద్దరి మధ్య అధర చుంబనం అద్భుతం అంటూ కామెంట్స్ వచ్చాయి. మనం సినిమాలో అయితే ఎప్పుడెప్పు చైతు సమంత ముద్దు పెట్టుకుంటారా అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూశారు. కొంతసేపైతే ఇద్దరి మధ్య లిప్ లాక్ లేదేమో అని ఫిక్సైయ్యారు. కాని క్లైమాక్స్ లో ఉన్న లిప్ కిస్ చూసి అబ్బ కడుపు నిండిపోయిందని ఆనందంగా బయటకి వచ్చారు అక్కినేని ఫ్యాన్స్. ఇక ఆ తర్వాత మళ్ళీ చైతు- సమంత కలిసి నటించలేదు.

 

ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు పెద్ద సినిమాలు చేస్తూ స్టార్ డం ని సంపాదించుకున్నారు. డీప్ గా లవ్ చేసుకున్న వీళ్ళు పెళ్ళి చేసుకొని సెటిలయ్యారు. నాగ చైతన్యని పెళ్ళి చేసుకున్నాక సమంత సినిమాలకి దూరం అవుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదంటూ కొట్టి పారేశారు. ఇక పెళ్ళి తర్వాత సమంత గ్లామర్ రోల్స్ కి కంప్లీట్ గా అవైడ్ చేసింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. అలా చేసినవే మజిలీ, ఓ బేబి . ముఖ్యంగా పెళ్ళి తర్వాత సమంత చైతు కలిసి చేసిన మజిలీ ఇద్దరికి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది. అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగా అందుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఇద్దరు కలిసి నటించడానికి అవకాశం ఉన్న స్క్రిప్ట్స్ ని తెమ్మని దర్శకులకు సలహా ఇస్తున్నారట.

 

ఇక అసలు విషయం ఏమిటంటే సమంత తాజాగా దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ తో కలిసి నటించిన సినిమా 96 అఫీషియల్ రీమేక్ జాను. ముందు ఈ ప్రపోజల్ సమంత చైతుల కే వచ్చిందట, కానీ ఎందుకో చైతూ ఆసక్తి చూపించలేదట. అందుకే సమంత పక్కన శర్వా ని తీసుకున్నారు. ఈ విషయంలో సమంత చైతూని ఏకేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సమంత సరసన చైతూ అయితే సినిమాకి విపరీతమైన బజ్ వచ్చేది. కానీ చైతు రిజకెట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అన్న మాట తప్ప అసలు రావాల్సిన బజ్ రాలేదు. అందుకే చైతూ ఇంకోసారి ఇలా కాకుండా చూసుకుంటాను. మనం కలిసి నటిస్తే బావుంటుందనిపిస్తే తప్పకుండా మనమే చేద్దామని సమంతని బ్రతిమాలుతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: