టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడనే వార్త ఎంత సెన్సేషన్ అయిందో తెలిసిందే. ఆయన సినిమాలు చేయడం అభిమానులకే కాదు.. ప్రేక్షకులకు కూడా మంచి వార్తే. ఆయన సినిమాలో అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తూంటారు. పవన్ సినిమాలో అవకాశం వస్తే ఆయా నటీనటులకు బంపర్ ఆఫర్ కిందే లెక్క. ప్రస్తుతం అలాంటి లక్కీ ఆఫర్ రంగమ్మత్తగా తన పెర్ఫార్మెన్స్ తో రంగస్థలంలో నటించి మెప్పించిన అనసూయకు దక్కిందనే వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

 

 

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తన 27వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అఫిషియల్ షూటింగ్ కూడా ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అనసూయకు ఓ కీలక రోల్ దక్కిందని సమాచారం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనసూయ రోల్ కీలకమైందని యూనిట్ వర్గాల నుంచి వస్తున్న వార్త. ఇంపార్టెంట్ క్యారెక్టర్ తో పాటు ఓ సొంగ్ కూడా అనసూయపై ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా రౌండ్ అవుతున్న వార్త. ఈ వార్తపై సినిమా యూనిట్ నుంచి గానీ.. అనసూయ నుంచి గానీ అఫిషియల్ గా న్యూస్ అయితే రావాల్సి ఉంది. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

 

 

నిజానికి అత్తారింటికి దారేది సినిమాలోనే వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంది. దాంతో పవన్ ఫ్యాన్స్ నుంచి అనసూయకు తీవ్రమైన ట్రోలింగ్స్ తప్పలేదు. అయితే ఆ సమయంలో తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని అందుకే అవకాశం వద్దనుకున్నానని తర్వాత పలు ఇంటర్వ్యూల్లో అనసూయే చెప్పింది. మరి ఈసారి నిజంగా పవన్ సినిమాలో అవకాశం వచ్చిందన్న మాట నిజమైతే ఆమెకు లక్కీ చాన్స్ కిందే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: