టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్ళ పాటు ఒక వెలుగు వెలిగి ఆరిపోయింది. ప్రస్తుతం ఈ మెరుపు తీగ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడా ఎన్ని వంకర్లు తిరిగినా ఒక్క అవకాశం కూడా రావడం లేదు. సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవడంతో వరుసగా పెద్ద బ్యానర్స్ నుండి అవకాశాలు వచ్చాయి. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకొని హిట్ స్ మీద హిట్స్ అందుకుంది. రాం, సాయి ధరం తేజ్, నాగ చైతన్య, రాం చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, బాలయ్య, గోపీచంద్, మంచు మనోజ్ ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. వాటిలో సగం సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని యావరేజ్ సినిమాలు ఉన్నాయి. కానీ రకుల్ కి మాత్రం క్రేజ్ బాగా ఉండేది. కానీ కొత్త హీరోయిన్స్ రావడంతో రకుల్ ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.

 

అయితే మద్య మద్యలో బాలీవుడ్ కోలీవుడ్ ఫ్లైట్స్ కూడా ఎక్కింది. అయితే అక్కడ హిట్స్ మాత్రం దక్కించుకోలేకపోయింది రకుల్. బాలీవుడ్ లో బాగా ట్రై చేసింది. అయ్యారే సినిమా అంతంత మాత్రంగా ఆడింది. దాంతో ఆ సినిమా రకుల్ కి ఉపయోగపడింది లేదు. ఆ తర్వాత అజయ్ దేవ్ గన్ టబు నటించిన దే దే ప్యార్ దే సినిమాలో సెకండ్ లీడ్ గా నటించింది. సినిమా హిట్ అయినప్పటికి ఆ క్రెడిట్ అజయ్ టబు లకి వెళ్ళింది. పాపం రకుల్ కి ఏమీ మిగల్లేదు. పేరుకి బాలీవుడ్ సినిమా అజయ్ దేవ్ గన్ హీరో ..అయన సరసన హీరోయిన్ చెప్పుకోవడానికి రకుల్ కి ఇవే మిగిలాయి పాపం.

 

అయితే టాలీవుడ్ సీనియర్ హీరో ఇప్పటికి నవ మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్ మన్మధుడు 2 లో ఏకంగా నాగ్ సరసన నటించింది. ఈ ఛాన్స్ వచ్చినప్పుడు రకుల్ ఆనందం పట్టలేనంతగా అయిపోయింది. మళ్ళీ నా ఖాతాలో సూపర్ హిట్ ఖాయం అనుకుంది. నాగ్ సరసన నటిస్తే చైతు-అఖిల్ సినిమాలలో ఛాన్సులు వస్తాయి. లేదా నాగ్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు కదా ..వాళ్ళైనా పిలుస్తారని ఓ ... బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

 

అంతేకాదు ఈ సినిమాలో కావలసినంత బోల్డ్ గా నటించింది. దమ్ము కొట్టింది, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పింది. మళ్ళీ సక్సస్ కొట్టాలని డైరెక్టర్ ఏది చెప్పినా చేసింది. దాంతో నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేసేలా సినిమాలో కనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడు రకుల్ ని సినిమా కోసం, క్రేజ్ కోసం సాంతం వాడేశాడు. తీరా చూస్తే సినిమా డిజాస్టర్. అమ్మడికి మైండ్ బ్లాకయింది. ఒక్క చాన్స్ ఇచ్చే మేకర్స్ గాని హీరోలు గాని లేరు. మన్మధుడు మీద ఆశలు పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అయ్యాక ఇలా వదిలేశారు అని ఇప్పుడు ఫీలవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: