సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు నీకెవ్వరు హిట్ అన్న టాక్ అయితే వచ్చింది గాని మహేష్ రేంజ్ సినిమా మాత్రం కాదని అందరూ అనుకున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని తీసి వరుసగా నాలుగు హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకొని సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ పేరు తెచ్చుకున్న అనీల్ రావి పూడి సూపర్ స్టార్ ని అద్భుతంగా చూపిస్తాడని అందరూ అనుకుంటే యావరేజ్ సినిమా తీసి పరువు పోగొట్టుకున్నాడు. వాస్తవంగా అనిల్ కి ఉన్న ట్రాక్ రికార్డ్ తో అందరూ మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం అని అనుకున్నారు. కానీ పేరుకే బ్లాక్ బస్టర్ కా బాప్ తప్ప వాస్తవంగా అంత సీన్ లేదు. 

 

రజనీ కాంత్ దర్బార్, సరిలేరు, అల వైకుంఠపురములో, ఎంత మంచి వాడవురా ..ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి పోటీలో దియాయి. అయితే రజనీ సర్బార్ కి అంత బజ్ క్రియొట్ అవలేదు. దాంతో మన దగ్గర అసలు పట్టించుకోనేలేదు. ఇక కళ్యాణ్ రాం సినిమా అంటే అంతే సంగతి. పాపం సోలో డేట్ అన్న చూసుకుంటే కాస్తో కూస్తో నెట్టుకొచ్చేవాడేమో. కానీ ఏదో మొండి ధైర్యంతో దిగాడు. మొండి చెయ్యో మిగిలింది. సంక్రాంతి సీజన్ తప్పించుకుంటే కళ్యాణ్ రాం కాస్త సేఫ్ అయ్యో వాడే. కానీ అనవసరంగా వచ్చి మహేష్, బన్నీ ల మధ్య నలిగిపోయాడు.

 

ఇక సరిలేరు రిజల్ట్ తో ఫస్ట్ టైం అనీల్ రావిపూడికి మంచి అనుభవం వచ్చింది. మూర్ఖంగా అరిగిపోయిన కామెడి ట్రాక్ ని నమ్ముకొని శ్రీను వైట్ల మాదిరిగా చితికి పోయాడు. అసలు సూపర్ స్టార్ లాంటి హీరో దొరికితే ఎలాంటి సినిమా తీయాలి. ఆయన తో కూడా పిచ్చి కామెడీ చేపించి జనాలతో పిచ్చెక్కిందా అనిల్ రావిపూడి అనిపించుకున్నాడు. అయితే రీసెంట్‌గా అనిల్ కి మెగా పవర్ స్టార్ రాం చరణ కూడా షాకిచ్చినట్టు తెలుస్తోంది. సరిలేరు కి ముందు నుంచే అనిల్ నెక్స్ట్ చరణ్ తో సినిమా అంటూ జనాలను ఊదరగొడుతున్నాడు. కాని సరిలేరు రిజల్ట్ తో అనిల్ కి చరణ్ ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదనిపిస్తోంది. కాని అనిల్ మాత్రం నెక్స్ట్ సినిమా చరణ్ తో అంటూ చెప్పుకుంటుంటే అది కాస్తా చరణ్ చెవికి చేరే సరికి చరణ్ అనిల్ రావిపూడికి చిన్న వార్నింగ్ ఇచ్చాడట. నేను ఇంకా ఏమీ చెప్పకుండా నువ్వు ఎలా మనం సినిమా చేస్తున్నామని చెప్తావ్ అంటూ గట్టిగా అన్నాడట. ఏదేమైనా అనిల్ కి సరిలేరు ఎఫ్ఫెక్ట్ కాస్త పడినట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: