శర్వానంద్ హీరోగా  2014లో చిన్న సినిమాగా రిలీజ్ అయి, పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం రన్ రాజా రన్.. ఈ చిత్రం నటుడిగా శర్వాకు, దర్శకుడిగా సుజీత్ కు మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పాలి. ఆ విధంగా తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సుజీత్, రెండోవ సినిమానే ప్రభాస్‌తో చేయడం నిజంగా ఏ డైరెక్టర్‌కు దక్కని అవకాశంగా చెప్పవచ్చూ. ఇక 24 ఏళ్ల వయసులో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన అనుభవం లేని సుజీత్ రన్ రాజా రన్ చిత్రం ద్వారా దర్శకుడై పోయాడు. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో బాహుబలిని డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

 

 

అయితే ఈ ఐదేళ్లలో సాహో కథలో పలు మార్పులు, చేర్పులు చేసిన సుజీత్, ఈలోపు ప్రభాస్ నటించిన బాహుబలి రెండు భాగాలూ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి, ఆయనకు పాన్ ఇండియా అపీల్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే సాహోని తెరకెక్కించిన సుజీత్ హలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని మలిచాడు. అయితే ఈ సినిమా స్టోరీ పరంగా బానే ఉన్నా కథను హ్యాండిల్ చేయడంలో జరిగిన పొరబాటు వల్ల సినిమా ప్లాప్ అయింది. సుజీత్ దర్శకుడిగా ఫెయిల్ అంటూ కామెంట్లు పడ్డాయి. హిందీలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో అనుకున్నంతగా వసూళ్లు సాధించలేక పోయింది..  అయితే అప్పటి నుండి సుజిత్ ఏ సినిమాకు కమిట్‌మెంట్ ఇవ్వలేకపోయాడు.

 

 

కానీ ఒక చిన్న సినిమా అయినా చేస్తాడని ఆశించారు అదీ జరుగలేదు. ఇకపోతే ఇప్పుడు సుజీత్ తన నెక్స్ట్ మూవీ విషయంలో భారీ ప్లాన్‌తో ఉన్నట్లుగా తెలిసింది.. అది కూడా భారీ బడ్జెట్ చిత్రాన్నే తెరకెక్కించబోతున్నాడట. తెలిసిన సమాచారం ప్రకారం సుజీత్ రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక లైన్ అనుకున్నట్లు, దాన్ని చరణ్ కు కూడా వినిపించినట్లు, ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత పూర్తి స్క్రిప్ట్ తో వస్తే కచ్చితంగా చేద్దామని రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే చరణ్ – సుజీత్ ల కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి... మొత్తానికి సుజీత్ మిగతా దర్శకుల్లా కాకుండా తనదైన మార్క్‌తో ముందుకు వెళ్లుతున్నాడని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: