టాలీవుడ్ లోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున్ ‘విక్రమ్’ మూవీ తో హీరోగా పరిచయం అయ్యాడు. రొమంటిక్ హీరోగా కనిపించినా.. శివ మూవీ తర్వాత యాక్షన్ తరహా మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.  నాగార్జున కేవలం రొమాంటిక్, యాక్షన్ హీరోగానే కాకుండా గతంలో తన తండ్రిలా ఎన్నో భక్తిరస పాత్రలో నటించి మెప్పించారు.  అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి, నమో వేంకటేశ్వర లాంటి మూవీస్ తో పరమభక్తుడిగా మెప్పించారు.  నాగార్జున తర్వాత ఆయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  అయితే నాగ చైతన్య ఇప్పటికే పది సంవత్సరాలు అవుతుంది.. చెప్పుకోదగ్గ హిట్స్ లేకున్నా.. కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతుంది.  

ఇక అఖిల్ అక్కినేని ‘అఖిల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే వావ్ అనిపించుకున్నాడు. కాకపోతే ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. దాంతో తన తదుపరి సినిమా పై ఫోకస్ చేశాడు..కానీ అది కూడా కమర్షికల్ హిట్ కాలేదు. ఇలా అఖిల్ నటించి మూడు మూవీస్ ఫ్లాప్ టాక్ వచ్చాయి. మనం సినిమాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ ఫ్యూచర్ స్టార్ అన్నారు. అఖిల్ తొలి సినిమా వేడుకలో మహేష్ బాబు పాల్గొని అఖిల్ కు స్టార్ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు మాట్లాడాడు. ఫ్యూచర్ లో నిజంగానే అవ్వోచ్చేమో కానీ ఆ దిశగా తొలి అడుగులు అయితే పడలేదు. 

అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు అఖిల్, హలో, mr. మజ్ను సినిమాలు దేనికవే ప్లాపులుగా నిలిచాయి. ఇదిలా ఉంటే షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈరోజు చిత్ర టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ మూవీ అఖిల్ కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: