తెలుగు చిత్రం పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు.. వస్తూనే ఉన్నారు.  అయితే కొంత మంది మాత్రమే స్టార్ డైరెక్టర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కొంతమంది ఎన్ని సినిమాలు తెరకెక్కించిన సరైన హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.  ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా సాగుతుంది.  అలాంటి యంగ్ డైరెక్టర్లలో ఒకరు సుజిత్.   కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో శర్వానంద్ హీరోగా ‘రన్ రాజా రన్’ మూవీ తెరకెక్కించాడు. ఈ మూవతో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతే తొలి సినిమా విజయంతోనే ప్రభాస్ నుండి పిలుపొచ్చింది. అది కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించబోయే చిత్రం.

 

భారీ కాన్వాస్, అత్యధిక బడ్జెట్.. ఇలా అన్నీ కలగలిపి సాహో చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ కాన్వాస్, అత్యధిక బడ్జెట్.. ఇలా అన్నీ కలగలిపి సాహో చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాలు వేశారు. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన సాహో అంచనాలు తారు మారు చేసింది.  బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రభాస్ ఈ మూవీతో దారుణమైన పరవాభవాన్ని పొందారు.  ఈ మూవీ హిందీలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో ఈ సినిమా ప్లాపైంది. అయితే సుజీత్ టాలెంట్ ను తక్కువ చేయడానికి లేదు. మరో ఆసక్తికర సబ్జెక్ట్ తో మన ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 

 

కంటెంట్ ఉన్నోడికి ఎప్పుడూ వెండితెర వెల్ కమ్ చెబుతూనే ఉంటుంది. ఈ కుర్ర హీరో ఈసారి చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లే సమాచారం. అంతే కాదు ఈసారి ఏకంగా రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక లైన్ అనుకున్నట్లు, దాన్ని చరణ్ కు కూడా వినిపించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే చరణ్ – సుజీత్ ల కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చుఅని టాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: