అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి ౧౪ న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాకి ముందు మనోడికి డియర్ కామ్రేడ్ రూపంలో భారీ డిజాస్టర్ వచ్చి పడింది. దాంతో ఒక్కసారిగా ఆకాశంలో నుండి కింద పడ్డట్టు అయింది.

 

 

భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మరియు బిగ్ బెస్ సినిమాస్ కలిసి సంయుక్తంగా రూపొందించిన డియర్ కామ్రేడ్ సినిమా మీద అంచానాలు భారీగా ఉండడంతో, ఆ అంచనాలని అందుకోలేని డియర్ కామ్రేడ్ బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. నటన పరంగా విజయ్ పర్ ఫార్మెన్స్ బాగున్నప్పటికీ సినిమా లెంగ్త్ ఎక్కువ ఉందని కంప్లైంట్స్ రావడంతో ప్రేక్షకుల నుండి వ్యతిరేకత వచ్చింది.

 

 


అప్పటి వరకూ విజయ్ వరుస విజయాలకి డియర్ కామ్రేడ్ రూపంలో బ్రేక్ పడింది. దాని ప్రభావం విజయ్ తర్వాతి చిత్రాల విషయంలో పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బాక్సాఫీసు వద్ద సూపర్ ఫ్లాప్ అయిన ఈ చిత్రం నార్త్ లో తెగ ఆడేస్తోంది. అదేంటి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేశారా అని అనుమానిస్తున్నారా! ఆశ్చర్యపోకండి. డియర్ కామ్రేడ్ సినిమాని యూట్యూబ్ ఛానల్ అయిన గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ డబ్ చేసి విడుదల చేసింది.

 

 

అయితే ప్రస్తుతం డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. రెండు వారాల క్రితం యూట్యూబ్‌లో పెట్టిన ఈ చిత్రానికి ఇప్పటికి ఆరు కోట్లకి పైగా వ్యూస్‌ వచ్చాయి. అర్జున్‌రెడ్డి పాపులారిటీతో పాటు ఉత్తరాదికి కనక్ట్‌ అయ్యే 'మీటూ' పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో డియర్‌ కామ్రేడ్‌ని ఎగబడి చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: