టాలీవుడ్ లో సెన్సేషన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  పెళ్లి చూపులు మూవీతో మంచి విజయం అందుకున్న ఈ యంగ్ హీరో తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  ఈ మూవీ తర్వాత వెంటనే పరుశరామ్ దర్శకత్వంలో ‘గీతా గోవిందం’ మూవీతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరారు.  ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.  ఈ జంట కెమిస్ట్రీ చూసి అందరూ మురిసిపోయారు.  ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సూపర్ హిట్ అయ్యింది. 

 

మరోసారి భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' తెరకెక్కించారు.  గీతాగోవిందం జంటగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.  కాకపోతే కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ సినిమా హిట్ కొట్టేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను 2 వారాల క్రితం యూట్యూబ్ లో పెట్టారు. అయితే అర్జున్ రెడ్డి  సినిమా నుంచే విజయ్ దేవరకొండకి ఇతర భాషల్లోను అభిమానులు పెరుగుతూ వస్తున్నారు.

 

'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో రీమేక్ చేసే సమయంలోను ఒరిజినల్ చూసి, విజయ్ దేవరకొండకి అభిమానులుగా మారిపోయారు.  అర్జున్ రెడ్డి రిమేక్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తెరకెక్కించారు సందీప్ వంగా.  అక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఈ ప్రభావంతో విజయ్ దేవరకొండ నటించిన డీయర్ కామ్రెడ్  2 వారాల్లోనే ఈ సినిమా 6 కోట్లకి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం.  మొత్తానికి తెలుగు లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం దుమ్మురేపుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: