2020 నెల దాటిపోయింది. జనవరిలో చిన్న సినిమాల నుంచి స్టార్స్ వరకు అన్ని రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. పదుల సంఖ్యలో సినిమాలు రిలీజైనా హిట్ అయింది రెండు మాత్రమే. జనవరి నెల రిజల్ట్ ఎలా ఉందో ఓ సారి పరిశీలిస్తే..!

 

జనవరి నెల రిజల్ట్ బాగుంటే.. శుభారంభం అని.. ఆ ఏడాది బాగుంటుందని సినీ వర్గాలు భావిస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో వచ్చే సినిమాలపై సక్సెస్ పర్సెంటేజ్ ఆధారపడి ఉంటుంది. ఈ పండుగకు నాలుగు సినిమాలు వస్తే.. రెండు హిట్ అయ్యాయి. రెండు నిరాశపరిచాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన దర్బార్ డబ్బులు రాబట్టలేకపోయింది. గతేడాది సంక్రాంతికి వచ్చిన పేట తెలుగులో ఫ్లాప్ అయినా.. తమిళంలో హిట్ అయింది. 

 

సంక్రాంతి సీజన్ లో చివరిలో వచ్చిన చిత్రం ఎంతమంచివాడవురా. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం బంధాలు.. అనుబంధాలు అనే కాన్సెప్ట్ తో వచ్చినా.. ఎమోషన్స్ సప్లయిర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. 

 

దర్బార్.. ఎంతమంచివాడవురా.. ఫ్లాప్ అయినా.. ఈ సంక్రాంతి సూపర్ హిట్టే. ఈ మధ్యకాలంలో ఏ సంక్రాంతికి లేని విధంగా రెండు సంక్రాంతి సినిమాలు 100కోట్ల మార్క్ దాటేసి కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చి సరిలేరు నీకెవ్వరు.. హీరో కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది. 


సంక్రాంతికి వచ్చిన మహేశ్, బన్నీ సినిమాలు పోటాపోటీగా వసూళ్లు రాబట్టాయి. అల వైకుంఠపురములో అయితే.. ఓ అడుగు ముందుకేసి.. సంక్రాంతి వసూళ్లను ఎడపెడా దోచేసిన కొత్త రికార్డులు నెలకొల్పింది. అప్పటివరకు నాన్ బాహుబలి పేరు మీదున్న రంగస్థలం రికార్డ్ ను క్రాస్ చేసింది. 

 

సరిలేరు నీకెవ్వరు... అలవైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద 250కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. 2020లో సంక్రాంతి శుభసూచకంగా నిలిస్తే.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక్కటీ నిలబడలేదు. నాగశౌర్య రూటు మార్చి క్రైమ్ థ్రిల్లర్ అశ్వద్థామగా వచ్చాడు. సినిమా బడ్జెట్.. బిజినెస్ తక్కువ కావడంతో.. నష్టాల నుంచి తప్పించుకుంది. 

 


రవితేజ ఎన్నో ఆసలు పెట్టుకున్న డిస్కోరాజా 24న రిలీజ్ అయింది. ఎక్కడికిపోతావు చినవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా డిస్కోరాజా రూపొందింది. సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ ను మెప్పించడంలో డిస్కోరాజా ఫెయిల్ అయ్యాడు. సంక్రాంతికి ముందు రెండు వారాల పాటు.. చాలా చిన్న చిత్రాలు రిలీజ్ అయినా.. ఒక్కటీ నిలబడలేదు. వైఫై.. ఉల్లాల ఉల్లాల.. బ్యూటీఫుల్ లాంటి చిత్రాల ఆచూకీ మిస్ అయింది. ఈ లెక్కన సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురంలో లేకపోతే.. జనవరలో బాక్సాఫీస్ వెలవెలపోయేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: