రీల్ లైఫ్ లో పోటీ పడుతూ రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చని నిరూపిస్తున్నారు ఇద్దరు టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్స్. వారిద్దరిలో ఒకరు రామ్ చరణ్ అయితే మరొకరు ఎన్టీఆర్. ప్రస్తుతం వీరిద్దరూ ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటిస్తూ భారీ రియల్ మల్టీస్టారర్ సినిమాకు నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ చేయబోయే సినిమాలపై ఇంకా పూర్తి క్లారిటీ రాకున్నా ఓ ఆసక్తికర వార్త మాత్రం ఇండస్ట్రీలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

 

 

అతి త్వరలో ఎన్టీఆర్ హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోందని ఓ వార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో చేయాలని ఆలోచిస్తున్నాడట. రామ్ చరణ్ హీరోగానే కాకుండా తండ్రి మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇందుకు సాక్ష్యాలుగా ఖైదీ నెం.150, సైరా సినిమాలనే తీసుకోవచ్చు. ఖర్చుకు వెనుకాడని ధైర్యం రామ్ చరణ్ లో ఉంది.

 

 

ఇక ఎన్టీఆర్ గురించి చెప్పే పని లేదు. మంచి ఫ్యాన్ బేస్ తో పాటు మార్కెట్ కూడా ఉంది. ఇందుకు మంచి కథ తోడైతే వీరిద్దరి కాంబినేషన్ లో మంచి సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రపోజల్ కు ఎన్టీఆర్ ఏమంటాడో అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అలాగే చిరంజీవితో సినిమాలు తీసి సక్సెస్ అయిన రామ్ చరణ్ మరి.. ఎన్టీఆర్‌తో స‌క్సెస్ అవుతాడా.. అనేది కూడా ప్రశ్నే. ఇదే నిజమైతే మెగా అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. ప్రస్తుతానికి గాసిప్ లా ఉన్న ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: