మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి అనేకమంది సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అందరు సక్సెస్ బాటలోనే ప్రయాణిస్తున్నారు.. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ దేవ్ కూడా సినిమాలు చేయాలనుకుని నటనలో శిక్షణ తీసుకుని మరీ విజేత అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు..  ఇకపోతే ఈ సినిమాతో అతను నటుడిగా నిరూపించుకున్నాడు తప్పితే, ఆ సినిమా వల్ల అతనికి కానీ, ఆ సినిమా టీమ్‌కి కానీ వచ్చిన లాభం ఏం లేదు..

 

 

ఇదే కాకుండా మెగా ఇంటి నుంచి వచ్చినప్పటికీ సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు.. అప్పటి నుండి సరైన కధ వేటలో ఉన్న కళ్యాణ్ దేవ్ మధ్యలో ఒక కధకు ఓకే చెప్పి షుటింగ్ కూడా మొదలు పెట్టాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు.. ఇదిలా ఉండగా తాజాగా నూతన దర్శకుడు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీ గాక భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారట..

 

 

ఇకపోతే చేసిన సినిమాతో ట్రాక్‌లో పడని కళ్యాణ్ తన స్దానాన్ని ఇండస్ట్రీలో పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మురం చేశారు.. ఇందులో భాగంగానే తన ఆశలన్నీ ఈ కొత్త చిత్రం పైనే పెట్టుకున్నాడు... అయితే అల్లుడుకు మంచి హిట్ అందిచాలని మెగా మామ చిరు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.. అంతేగాక ఇప్పటికే నూతన దర్శకుడు శ్రీధర్ సీపాన కు స్క్రిప్ట్  విషయంలో చిరంజీవి పలు సూచనలు కూడా ఇచ్చాడట. మొత్తానికి అల్లుడు కళ్యాణ్ తో హిట్ కొట్టించాలని చిరంజీవి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని సినీలోకం కోడై కూస్తుందంటున్నారు.. .

మరింత సమాచారం తెలుసుకోండి: