రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ పై మన దేశంతో పాటు విదేశాల్లో ఉన్న సినిమా లవర్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి అనే చెప్పాలి. గతంలో రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలు కూడా దేశ విదేశాల్లో ఎంతటి అద్భుత విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానితో ఒక్కసారిగా రాజమౌళి తీస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ పై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ముందుగా తమ సినిమాని ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన యూనిట్, నేడు ఒక్కసారిగా అందరికీ భారీ షాక్ ఇస్తూ తమ సినిమా వాయిదా పడిందని, 

 

ప్రేక్షకులకు మరింత మంచి క్వాలిటీ సినిమాని అందించాలనే ఉద్దేశ్యంతోనే సినిమా రిలీజ్ ని వచ్చే ఏడాది జనవరి 8కి తీసుకెళ్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఈ షాకింగ్ ప్రకటనతో టాలీవుడ్లో ఇప్పటికే రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్న సినిమాల పరిస్థితి కొంత అయోమయంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల సరిలేరు తో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్, తదుపరి వంశీ పైడిపల్లి తో చేయబోయే సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేద్దాం అని భావించారు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ డేట్ ప్రకటనతో ఆ సినిమా ముందుకు, లేదా వెనక్కు జరుగవచ్చని అంటున్నారు. 

 

అలానే దానితో పాటు ప‌వ‌న్ - క్రిష్ కాంబో సినిమాను కూడా వ‌చ్చే సంక్రాంతికి ప్లాన్‌ చేసారు. ఇక ఇప్పుడు రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ డేట్ అనైన్స్‌తో వాళ్ల‌కు చావుదెబ్బే పడిందనే చెప్పాలి. ఇక వ‌చ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్‌కు పోటీగా వీళ్లు వ‌చ్చే సాహ‌సం చేయ‌రనే తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇప్పుడు ప్రకటించి మంచి పని చేసారని, దీనివలన అదే సమయంలో రిలీజ్ చేయాలనుకున్న సినిమాల రిలీజ్ డేట్ మార్పుకు ఇప్పుడే మార్చుకునే వెసులు బాటు ఉంటుందని అంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్ వలన డైలమాలో పడ్డ పవన్, మహేష్ సినిమాలు ప్లాన్ చేసిన విధంగా కాకుండా ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: