అనసూయ హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకుని, ప్రస్తుతం చిత్రసీమలో కూడా మంచి, మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది.. ఇక యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ, ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి బిజీగా మారింది.. కైపెక్కే కవ్వింపులతో, ఆకట్టుకునే అందంతో, సొట్టలుపడే బుగ్గలతో, త్వరగానే ప్రేక్షకుల గుండెల్లో తిష్టవేసుకుంది.

 

 

నాగ సినిమాలో తళుక్కున మెరిసిన అనసూయ ఎవరికి గుర్తు రాదు. కాని సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో ఒక్క సారిగా మెరుపులు మెరిపించింది.. ఆ తర్వాత వచ్చిన చిత్రం క్షణం.. ఈ సినిమాలో ఒక మంచి పాత్రతో ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా రెండు తెలుగురాష్ట్రాల లోని అభిమానుల మనసుల్లో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలోనే తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది.

 

 

ఇదిలా ఉండగా ప్రస్తుతమనసూయ కోసం పాత్రలు సృష్టించే స్దాయికి చేరుకుంది.. అయితే ఇప్పుడు అనసూయకు మరో బిగ్ చాన్స్ దక్కిందట. ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ కొట్టేయగా, దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న పిరియాడిక్ సినిమాలో కూడా ఒక మంచి పాత్ర చేస్తోందట..

 

 

ఇందుకు గాను ఇప్పటికే దర్శకుడు క్రిష్ ఆమెకు లుక్ టెస్ట్ చేయడంతోపాటు, పాత్రకు సంబంధించిన అన్ని రకాల ఇన్ ఫుట్స్ ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇకపోతే తన మాటలు, పంచ్‌లతో బుల్లితెర ప్రేక్షకులను రంజిపజేస్తున్న వ్యాఖ్యాత, నటి అనసూయ. అవకాశం వస్తే, వెండితెరపై తన నటనతో, పాటుగా తన అందంతో దుమ్ముదులిపేస్తూ, చాన్స్‌లు అందిపుచ్చుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు అనూ అభిమానులు..

 

 

ఏది ఏమైనా ఇప్పుడున్న హీరోయిన్లకు అనసూయ గట్తి పోటీనే ఇస్తుందనుకుంటారు. ఒకప్పుడు చిత్ర రంగాన్ని ఏలిన నటీమణులు కూడా ఇంత మంచి అవకాశాలను పొందలెని పరిస్దితుల్లో ఉండగా, అనసూయకు పిలిచీ మరి అవకాశాలు ఇస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: