ప్రతీ మనిషిలో మంచి చెడు అని రెండు ఉంటాయి. అంటే మంచి వాడు చెడ్డవాడు. అయితే ఇది అవతలి వ్యక్తి ని బట్టి ఒక మనిషిని మంచి వాడిగా చెడ్డవాడిగా నిర్ధారించుకుంటారు. వాస్తవంగా అయితే ఏ మనిషి చెడ్డవాడు కాదని చెప్పొచ్చు. ఒక వ్యక్తీ రక రకాలుగా మారడానికి తన చుట్టు పక్కల ఉన్న పరిస్థితులు...ప్రభావితం చేసే మనుషులు, పరిస్థితులు. వీటి వల్లే మనిషిలో విభిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయమూ అంతే. ఈ పేరు వినగానే ఆయన్ని విపరీతంగా నానా బూతులు తిట్టుకునేవారే ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వేలు పెడుతూ వివాదాలు సృష్టిస్తుంటారు. అయితే వర్మలో ఓ మంచి మనిషి కూడా ఉన్నాడని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. 

 

ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ ‘భూత్: ది హాంటెడ్ షిప్’ అనే హార్రర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇదే సినిమా టైటిల్‌‌తో 2003లో వర్మసినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఊర్మిళ మటోండ్కర్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తన సినిమాకు ఏ టైటిల్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే కరణ్‌కు ‘భూత్: ది హాంటెడ్ షిప్’ అనే టైటిల్ గుర్తుకొచ్చింది. అయినా సరే అదే టైటిల్ ని ఫిక్స్ చేసుకుందామంటే వర్మ కస్సుమంటారేమోనని భయపడ్డారట. అందుకే ఒకసారి అడిగి చూద్దామని భయపడుతూనే వర్మకు ఫోన్ చేశారట కరణ్ జోహార్. అయితే వర్మ అంత బాగా మాట్లాడతారని తాను అసలు ఊహించలేదని కరణ్ తెలిపారు. 

 

వర్మ మంచితనానికి ఫిదా అయిపోయారట కరణ్. కరణ్ చెప్పిందంతా విని ఆయన ఒక్కటే మాట అన్నారట వర్మ. నీకు నా సినిమాలకు సంబంధించిన ఏ టైటిల్ కావాలన్నా తీసుకో. ఏ పేపర్‌లో సంతకం పెట్టమన్నా పెడతాను అన్నారట. అలా రెండు సెకన్లలోనే ఆయన తన సినిమా టైటిల్‌ను కరణ్ కి ఇచ్చేసారట. ఆయన అంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. నేను చిత్ర పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నాను. అంతటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు’ అని కరణ్ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక ‘భూత్: ది హాంటెడ్ షిప్’ సినిమాలో భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటించగా ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే కొందరు మాత్రం కరణ్ ని వర్మ మంచ్వాడేంటి ..ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలతో పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు కదా ..మీకేమన్నా పిచ్చెక్కిందా అంటూ కామెంట్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: