ఇప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు తెర తీస్తూ వచ్చే సంవత్సరం జనవరి 8న ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవుతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన కొన్ని గంటలలోనే ఈ ప్రకటన పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ జనవరి రెండవ వారంలో వస్తుంది. 


దీనితో ఈపండుగకు ఒక వారం రోజులు ముందుగా విడుదలై ఆ తరువాత వచ్చే సంక్రాంతి పండుగ సరదాలను కొనసాగిస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ కు విడుదలైన తేదీ నుండి రెండు వారాల పాటు ఆ సినిమాకు కనీవినీ ఎరుగని స్థాయిలో కలక్షన్స్ రప్పించుకుని తన ‘బాహుబలి 2’ రికార్డులను ‘ఆర్ ఆర్ ఆర్’ తో బ్రేక్ చేయాలని రాజమౌళి వ్యూహం అని అంటున్నారు. అంతేకాదు ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాకు భయపడిపోయి సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ లో ‘ఆర్ ఆర్ అర్’ కు పోటీగా మరే సినిమా విడుదల లేకుండా చేసుకుందామని రాజమౌళి ఆలోచన అన్నవార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు సంక్రాంతి పండుగకు మధ్య వారం రోజులు గ్యాప్ ఉన్న పరిస్థితులలో ఎదో ఒక సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ కు పోటీగా విడుదలై తీరుతుందని సంక్రాంతికి సంబంధించి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు దక్కకుండా ప్రయత్నాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ కథ అంతా స్వాతంత్రోద్యోమ నేపధ్యంలో కొనసాగుతుంది. బ్రిటీష్ వారిని విలన్స్ గా చూపెడుతూ అప్పటి తరం వారు చేసిన త్యాగాలు చుట్టూ ‘ఆర్ ఆర్ ఆర్’ కథ నడుస్తుంది. అయితే ఇప్పటి తరానికి స్వాతంత్రోద్యమం గురించి అప్పటి పరిస్థితుల గురించి పెద్దగా అవగాహన లేదు. 


ఈ కారణం వల్లనే ఎంతో కష్టపడి చిరంజీవి ‘సైరా’ ను తీసినా తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు రికార్డుల కలక్షన్స్ ను ఇవ్వలేదు. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ లో పాటలు అన్నీ ఎక్కువగా దేశభక్తితో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మాస్ పాటలకు అవకాశం తక్కువ అందువల్లనే హంస నందిని చేత ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ను మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాలో పెడుతున్నాడు. రాజమౌళి జూనియర్ చరణ్ ల ఇమేజ్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ కు అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఆ మ్యానియా కనీసం రెండు వారాలు కొనసాగాలి అన్న ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల కలక్షన్స్ కు బంగారు గనిగా భావించే సంక్రాంతి సీజన్ ను కూడ జతచేసి ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డుల విషయంలో ఎక్కడా ఫెయిల్ కాకుండా రాజమౌళి జాగ్రత్తపడుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: