సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ శుక్రవారం జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. అక్కడ విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా ఇక్కడ శర్వానంద్, సమంత కలిసి చేశారు. దిల్ రాజు నిర్మాణంలో మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత యాక్టివ్ గా పాల్గొంటుంది. తను చేసే సినిమా సక్సెస్ అవ్వాలి.. నిర్మాతకు డబ్బులు రావాలి.. ఆడియెన్స్ వాళ్లు పెట్టిన డబ్బుకి వినోదాన్ని పొందాలని అంటుంది సమంత.

 

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో పాటుగా లేటెస్ట్ గా తన ఫోటో షూట్స్ తో కూడా హంగామా చేస్తుంది సమంత. మాములుగా అయితే పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కు పెద్దగా డిమాండ్ ఉండదు కాని అక్కినేని కోడలిగా మారాక కూడా సమంత విషయంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది. సమంతకు ఇంకా పెళ్లి కాలేదనే కొందరు భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే ఆమెకు ఇంకా లవ్ లెటర్స్ కూడా రాస్తున్నారు. అందం అభినయం రెండు కలిపితే అచ్చం సమంతలా ఉంటుందేమో అనేంతగా అటు అభినయంతో సినిమాలు సక్సెస్ కొడుతూ ఇటు అందంతో అందరిని ఎట్రాక్ట్ చేస్తుంది.

 

సమంత లేటెస్ట్ ఇన్ స్టా పిక్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓర చూపులతో సమంత చేస్తున్న ఈ స్పెషల్ షో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. సారీలోనే అయినా తను చేస్తున్న ఈ హాట్ అటెంప్ట్ అదిరిందని చెప్పొచ్చు. సినిమాలతో బిజీగా ఉంటూనే ఫోటో షూట్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న సమంతను చూసి మిగతా హీరోయిన్స్  అసూయ పడుతున్నారని మాత్రం చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పటికి వరుస స్టార్ అవకాశాలు అందుకుంటూ సమంత తన సత్తా చాటుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: