సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గురించి పాజిటివ్ గా మాట్లాడే వారు చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఆయన టాలెంట్ గురించి అందరు పొగిడినా ఆయన చేసే కామెంట్స్.. ఆయన నిలకడ లేని మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోరు. అయితే లేటెస్ట్ గా వర్మ లాంటి మంచోడిని నా పాతికేళ్ల కెరియర్ లో చూడలేదని అంటున్నాడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఆయన ప్రొడక్షన్ లో భూత్ : ది హాంటెడ్ షిప్ అంటూ ఓ హర్రర్ సినిమా చేశారు. అజయ్ దేవగం, ఊర్మిలా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

 

సినిమా హర్రర్ జానర్ లో వస్తుండగా సినిమాకు ఏ టైటిల్ పెట్టాలా అనే ఆలోచన చేశారు కరణ్ జోహార్. ఈ సినిమాకు భూత్ ది హాంటెడ్ షిప్ అనే టైటిల్ బాగా సూట్ అవుతుందని అనిపించింది. అయితే భూత్ టైటిల్ వర్మది కదా ఆయన ఏమైనా అనుకుంటారో ఏమో అని.. ఆయన పర్మిషన్ కోసం ఫోన్ చేశారట కరణ్ జోహార్. అయితే వర్మ ఈ విషయంపై చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని అంటున్నాడు కరణ్ జోహార్. తన సినిమా టైటిల్స్ ఏవైనా మీరు వాడుకోవచ్చని ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని అన్నాడట వర్మ.

 

సినిమాకు సంబందించి కాబట్టి వర్మ ఇలా రెస్పాండ్ అయ్యి ఉంటాడని అంటున్నారు. ఈమధ్య కొద్దిగా జోరు తగ్గించిన వర్మ దిశ ఘటనపై సినిమా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ ఘటనలో ఎన్ కౌంటర్ చేయబడిన చెన్నకేశవులు భార్యను పిలిపించుకుని మరి ఆమెతో మాట్లాడాడట వర్మ. మరి వర్మసినిమా ఎలా తీస్తాడో చూడాలి. ఈ సినిమాను వర్మ ఎలా ప్రాజెక్ట్ చేస్తాడు అన్నదాని మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: