ఏదో పావుగంట సేపు ప్రాసలు, పంచులు వేసి ఆడియెన్స్ ను నవ్వించడం కాదు సినిమా అంటే. రెండున్నర గంటల సినిమాలో ఆడియెన్స్ కు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో ఎవరం చెప్పలేం. అందుకే కంటెంట్ ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచనలో ఉంచుకుని సినిమాలు చేస్తారు. అయితే ముఖ్యంగా సినిమా సేఫ్ అనిపించుకోవాలని అంటే కామెడీ ఎంటర్టైనర్ అయితే చాలు అనుకుంటారు. అయితే అది కూడా ఆడియెన్స్ ను మెప్పించే కామెడీ అయితేనే వర్క్ అవుట్ అవుతుంది. ఇదిలాఉంటే జబర్దస్త్ లో తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్ అండ్ టీం ఇప్పుడు 3 మంకీస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కూడా తమ కామెడీ పంచాలని చూస్తున్నారు సుదీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్. జబర్దస్త్ లో ఈ త్రయానికి మంచి క్రేజ్ ఉంది. రైటర్ గా రాం ప్రసాద్, నటనలో గెటప్ శ్రీను, కామెడీలో సుధీర్ ముగ్గురు ముగ్గురే అనిపించేలా వారి స్కిట్స్ ఉంటాయి. అయితే జబర్దస్త్ లో కామెడీ వేరు వెండితెర మీద కామెడీ వేరు. 3 మంకీస్ అంటూ ఈ ముగ్గురు చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగినదే.

 

అయితే కామెడీ టైటిల్ పెట్టినా ఇందులో సీరియస్ కంటెంట్ ఉందని అంటున్నారు చిత్రయూనిట్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్నా సెకండ్ హాఫ్ ఎవరు ఊహించని విధంగా థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఆడియెన్స్ లో తనకున్న క్రేజ్ చూసుకుని సుధీర్ చేసిన మొదటి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మరి ఈ 3 మంకీస్ అయినా వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: