ఇటీవల కొద్దిరోజులుగా పలువురు టాలీవుడ్ నటులపై ఇన్కమ్ టాక్స్ అధికారుల దాడులు జరిగిన విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో పాటు ఇటీవల కన్నడ, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న ఇంటి పై కూడా ఐటి అధికారులు దాడులు చేసారు. ఇకపోతే నేడు ప్రముఖ తమిళ నటుడు, ఇళయదళపతి విజయ్ ఇంటిపై సడన్ గా ఐటి దాడులు జరిగినట్లు సమాచారం. అలానే ఆయన ఇంటితో పాటు ఇటీవల ఆయనతో బిగిల్ సినిమాని నిర్మించిన ఏజిఎస్ ఎంటెర్టైమెంట్స్ ఆఫీసులోనూ, ఆ సంస్థ నిర్మాత అర్చన కలపతి ఇంట్లో కూడా ఐటి అధికారులు సోదాలు జరిగినట్లు చెప్తున్నారు. 

 

బిగిల్ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో పాటు భారీగా వసూళ్లు అందుకున్నందున, వచ్చిన ఆదాయంపై టాక్స్ లు సరిగ్గా కడుతున్నారో లేదో అనేది తనిఖీ చేసేందుకే అధికారులు వచ్చి సోదాలు చేసినట్లు కొందరు చెప్తున్నారు. ఇక తమిళనాడు లోని సాలిగ్రామం, పణయుర్ లలో గల హీరో విజయ్ ఇళ్లలో కూడా సోదాలు చేసిన అధికారులు భారీ మొత్తంలోనే నగదు, బంగారాన్ని సీజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ ఇంటిపై ఈ దాడుల విషయం తెలియగానే పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ విజయ్ ఇంటి వద్ద, అలానే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనకు మద్దతుగా పలు ర్యాలీలు నినాదాలు చేస్తున్నారు. 

 

ఇంకొందరు అయితే ఎందరో అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్న వారిని వదిలి, నిరంతరం అభిమానుల కోసం అలానే, ప్రేక్షకుల కోసం తన వంతు సాయం అందించే తమ హీరోపై ఈ విధంగా తప్పుడు దాడులు చేయడం సమంజసం కాదని , తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రస్తుతం విజయ్, ఇటీవల కార్తీ తో ఖైదీ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ దర్శకతంలో మాస్టర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: