ఈరోజుల్లో కొత్త వాళ్ల సినిమా కానీ.. చిన్న సినిమాలు కానీ.. తమ సినిమాకు పబ్లిసిటీ రావాలంటే యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆసినిమాలో బోల్డ్ కంటెంట్ పెట్టడమో.. రెండు మూడు యూత్ డైలాగులు వేస్తే ఇలాంటి పబ్లిసిటీ రావడం ఈమధ్య కామన్ అయిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా నుంచి యూత్ టార్గెట్ మరింతగా పెరిగిపోయింది. ఆ సినిమా విడుదలకు ముందు ముద్దు పోస్టర్ల వల్ల ఎంత కలకలం జరిగిందో.. ఎంతగా పబ్లిసిటీ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కూడా ఇదే దారిలో వెళ్తోంది.

 

 

రేపు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న డిగ్రీ కాలేజ్ సినిమా విషయంలోనూ ఇదే థియరీ ఫాలో అయ్యారు మేకర్స్. రియల్ ఇన్సిడెంట్ ప్రకారం సినిమా తీసామని దర్శక, నిర్మాతలు చెప్తున్నా ప్రస్తుతానికైతే వివాదాస్పదం అవుతున్నాయి. సినిమా విడుదల సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్న యని కొందరు ఆ సినిమా దర్శక, నిర్మాతలపై పోలీసులకు కంప్లైంట్ చేశారట. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రత్యక్షమైన ఆ పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో దర్శక, నిర్మాతలపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

 

 

ఈ సినిమాకు నరసింహ నంది దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడి మొదటి ప్రయత్నానికే జాతీయ అవార్డు పొందాడు. 1940లో ఒక గ్రామం సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. కమలతో నా ప్రయాణం, హై స్కూల్ వంటి సినిమాలు రూపొందించాడు. ఈ సినిమాలో వరుణ్, శ్రీ దివ్య తదితరులు నటించారు. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని టీజర్లు చూసే కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలీసు కేసే కూడా నమోదవటంతో ఈనెల 7న విడుదల కావాల్సిన సినిమా పరిస్థితేంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: