టాలీవుడ్ లో పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ తో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత గీతా గోవిందం మూవీతో మరో సూపర్ హిట్ కొట్టాడు.  ఇక  హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘టాక్సీ వాలా’ తో మరో ఘన విజయం పొందాడు.  అయితే ఈ మూవీతో  పరిచయమైన ప్రియాంక జవల్కర్ తర్వాత మళ్ళీ ఇంకే సినిమాలోనూ కనిపించలేదు. ఓ రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చినా పాత్ర నచ్చని కారణంగా వదిలేసుకుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ తనుగా ఏ విషయం చెప్పలేదు.

 

అందం.. అభినయం ఉన్నఈ అమ్మడికి వెంటనే తెలుగు లో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో కెరీర్ పులిస్టాప్ పడిందా అన్న అనుమానాలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం ప్రియాంకా కి రెండు మంచి ఆఫర్లు వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరో అనిపించుకున్న కిరణ్, మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ  సినిమాలో హీరోయిన్ గా  ప్రియాంక జవల్కర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆ మద్య దర్శకుడు క్రిష్‌ వద్ద సినిమాటోగ్రాఫర్‌గా చేసిన జ్ఞానశేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీయబోయే డెబ్యూ మూవీలో ప్రియాంక హీరోయిన్‌గా నటించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  

 

ఇక శివ కందుకూరి హీరోగా దర్శకురాలు సుజన ఒక సినిమాను రూపొందించనుంది. ఈ సినిమాలో ఆయనకు జోడీగా ఆమె ప్రియాంకను తీసుకుంది. ఈ రెండు విజయాన్ని సాధిస్తే ప్రియాంక కెరియర్ ఊపందుకునే అవకాశాలు వున్నాయి. రాయలసీమ నుంచి వచ్చిన  హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా జవల్కర్ ఇకనైనా కెరీర్లో స్పీడ్ పెంచి కాస్త ఆఫర్ల మీద దృష్టి పెడితే మరిన్ని మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు ఫిలిమ్ వర్గాలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: