తెలుగు ఇండస్ట్రీలోకి ఝుమ్మందినాథం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పొన్ను.  ఈ మూవీతో తాప్సీ అందానికి కుర్రకారు దిమ్మతిరిగింది.   ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేదు.  అయితే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తాప్సికి మంచి క్రేజ్ మాత్రం ఉంది.  తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తుంది.  తాజాగా తాప్సీ బిగ్ బాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ మొదట హిందీలో వచ్చింది.  ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకొని పదమూడో సీజన్ రన్ అవుతుంది.  మొదటి నుంచి బాలీవుడ్ బిగ్ బాస్ కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  

 

బిగ్ బాస్ అంటే కొంత మంది వ్యక్తుల సమూహం.. ఒకే దగ్గర ఉంచి..రెగ్యులర్ జీవనంలో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? కూల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఇలా వారి మద్య వచ్చే హడావుడి గురించి అందరికీ తెలిసిందే.  బిగ్ బాస్ షో లో ఒకర్ని ఒకరు దుర్భాషులాడుకోవడం..కొట్టుకోవడం.. తిట్టుకోవడం వంటి కాంట్రవర్సీలు సృష్టిస్తుంటారు. వీక్ ఎండ్ లో హూస్ట్ వచ్చి వారిని నాలుగు దుమ్ముదులిపి పోతుంటారు.   ఇప్పటికే బిగ్ బాస్ వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు షోను ఉద్దేశించి తమదైన శైలిలో కామెంట్ల తో విరుచుకు పడుతున్నారు. తాజాగా తాప్సీ బిగ్ బాస్ షో పై తనదైన శైలిలో చెలరేగింది.  

 

ఒకప్పుడు బిగ్ బాస్ చాలా పద్దతిగా ఉండేది. ఎంతో ఆసక్తికరంగాను ఉండేది. కానీ రాను రాను షోలో హింస భయంకరంగా పెరిగి పోయింది. ఇంటి సభ్యులు బండ బూతులు తిట్టుకోవడం... కొన్ని సార్లు మ్యాన్ హ్యాండిలింగ్ చేసుకోవడం... జంగా బిగ్ బాస్ పరువు బజారున పడిందేమో అనిపిస్తుంది. ఇలాంటి షోను ప్రేక్షకులు అంతే ఆసక్తిగా చూడటం నచ్చలేదు.  ఇది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటన్నారు.. కానీ చాలా మంది విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. మొత్తానికి తాప్సీ బిగ్ బాస్ పై ఫైర్ కావడం సోషల్ మీడియా లో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: