హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీని ఏలేద్దాం అనుకున్న హంస నందిని కి తెలుగు చిత్ర పరిశ్రమలో చుక్కెదురైంది. హీరోయిన్ కాదు కదా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెటిలవలేకపోయింది. అందం అభినయం ఉన్నప్పటికి అది హీరోయిన్ కి కావలసినంత లేకపోవడం హంస బ్యాడ్ లక్. దాంతో కనీసం ఒక మోస్తారు హీరోల సరసన హీరోయిన్ గా కూడా అవకాశాలను అందుకోలేకపోయింది. ఐటం సాంగ్స్, అప్పుడప్పుడు ఏదో ఒక క్యారెక్టర్స్ తో అలా అలా మెరుస్తుంది. అయితే హంసకి అదిరిపోయో ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం. 

 

రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 
ఈ సినిమాను 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు జక్కన్న బృందం. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. చరణ్.. ఎన్టీఆర్.. ఆలియా.. అజయ్ దేవగన్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసందే.

 

చిన్న పాత్ర పెద్ద పాత్ర అనే తేడా లేకుండా అన్ని పాత్రలకు కూడా వెల్ నోటెడ్ ఆర్టిస్టులను జక్కన్న తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఒక కీలకమైన పాత్రకు హంస నందినిని తీసుకున్నట్లు గా సమాచారం. అతి త్వరలోనే హంస షూటింగ్ జాయిన్ కాబోతోందని లేటెస్ట్ న్యూస్. ఇంకా అధికారికంగా ఈ విషయంలో జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు. కాని హంస తన సన్నిహితులతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటుందని తెలుస్తోంది.

 

ఇంతకముందు సమంత-నాని నటించిన ఈగ సినిమాలో చిన్న పాత్రను హంస నందిని తో చేయించిన రాజమౌళి మరోసారి తనకి ఛాన్స్ ఇచ్చారు. హీరోయిన్ గా పరిచయం అయిన హంస ఆ తర్వాత ఐటెం సాంగ్స్ కు తప్ప ఇక దేనికి దర్శక నిర్మాతలు అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో జక్కన్న నుండి పిలుపు రావడంతో హంసకు మళ్లీ కెరీర్ పై ఆశలు కలిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: