ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ ఆర్ఆర్. డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కథను వి విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా సినిమాని వచ్చే ఏడాది జనవరి 8 న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనుంది యూనిట్. 

 

ఇకపోతే ఈ సినిమాలో హీరోలిద్దరికి సంబందించిన కొన్ని కీలక సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని, అలానే ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి సినిమాకు ఎంతో ప్రాణం అని చెప్తున్నారు. ఇక కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ హీరోలు అనడం కంటే సినిమాని బలంగా ముందుకు తీసుకెళ్లే రెండు బలమైన పాత్రలని, నిజానికి ఈ సినిమాలోని కథే అసలుసిసలైన హీరో అని అంటున్నారు. ఇక తన సినిమాలకు హీరోలను బేస్ చేసుకుని కథ సిద్ధం చేసే అలవాటు లేని రాజమౌళి

 

తన తండ్రి రాసిన ఇద్దరు విప్లవ వీరుల వీరగాధలను దృష్టిలో పెట్టుకుని ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేయగల హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ లని ఎన్నుకున్నారని అంటున్నారు. ఇక ఆద్యంతం మంచి ఆసక్తికరంగా సాగె ఈ సినిమా తప్పకుండా ఇండియన్ ఫిలిం హిస్టరీ లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడం ఖాయం అని సమాచారం. ఇప్పటికే బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో విపరీతమైన పేరు గడించిన రాజమౌళి, ఈ సినిమాతో మరింత గొప్ప పేరు సంపాదించనున్నట్లు టాక్. మరి ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఏంటో తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సమయం వరకు వేచి చూడక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: