2018 సంవత్సరం అక్టోబర్ నెలలో తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన 96 సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాలోని రామచంద్రన్, జాను పాత్రల్లో నటించారు అనే కంటే జీవించారు అనే చెప్పాలి. తమిళంలో క్లాసిక్ హిట్ అయిన 96 సినిమా రీమేక్ తెలుగులో దిల్ రాజు నిర్మాతగా శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కి ఈరోజు జాను పేరుతో విడుదలైంది. 
 
96 సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ జాను సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫస్టాఫ్ కు పాజిటివ్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. శర్వానంద్, సమంత ఖాతాలో హిట్ చేరినట్లే ఆడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. 96 సినిమా ఇప్పటికే చూసేసిన వారికి ఫస్టాఫ్ గొప్పగా అనిపించకపోయినా చూడని వారికి మాత్రం మంచి అనుభూతిని అనుభవంగా ఇస్తుంది. ఇంటర్వెల్ సీన్ ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. 
 
సినిమా చూస్తున్నంతసేపు మన నిజజీవితంలోని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఫస్టాఫ్ లో ఒక ఫ్లోలో నెమ్మదిగా మొదలైన జాను సినిమాలో చిన్నప్పటి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు. పాత్రల్లో అందరూ అద్భుతంగా నటించి పాత్రలకు ప్రాణం పోశారు. జాను సినిమా స్వఛమైన ప్రేమ అంటే అర్థం చెప్పేలా ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 
 
నూతన సంవత్సరంలో సమంతకు, శర్వానంద్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమేనని చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ కొంత నిదానంగా ఉన్నా మనసులను హత్తుకునే విధంగా ఉంది. 96 లో ఉన్న మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. ఒరిజినల్ కు సంగీతం అందించిన గోవింద్ వసంత జాను సినిమాకు కూడా సంగీతం అందించడం సినిమాకు ప్లస్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: