శర్వానంద్ మరియు సమంత జంటగా నటించిన జాను సినిమా కొద్ది గంటల క్రితం థియేటర్లలో విడుదలైంది. మంచి హిట్ కంటెంట్ తో రీమేక్ చేయబడిన చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా అదేరీతిలో ఆకట్టుకుంది. అయితే విజయ్ సేతుపతి మరియు త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్ శర్వానంద్ మరియు సమంత రిపీట్ చేయగలరా అని అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ వీరిద్దరూ చాలా చోట్ల వారిద్దరినీ మరిపించేలా నటించమే చిత్రానికి పెద్ద హైలెట్. ఇక త్రిష చేసిన పాత్రను సమంత ఒక ఛాలెంజ్ గా తీసుకుంది అనే చెప్పాలి. సమంత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పాత్ర చేయడం మామూలు విషయం కాదు.

 

గొప్ప నటి అనిపించుకోవాలి అంటే అందుకు తగిన శ్రమ మరియు అంకితభావం ఉండాల్సిందే. సమంతకు ఇవి రెండూ పుష్కలంగా ఉన్నాయి. నాగ చైతన్య తో పెళ్లి అయ్యి దాదాపు చాలా రోజులు అయినా కూడా తను తన ఫిజిక్ ను మెయింటైన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత తమ కెరీర్ కు గుడ్ బై చెప్పడం లేదా తల్లి వేషాలను వేయడం లేడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది అక్కినేని కుటుంబం లాంటి ఫ్యామిలీ లో ఉన్నా కూడా సమంత ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంది అంటే కుటుంబం మరియు చైతన్య నుండి వచ్చిన ధైర్యం అనే చెప్పాలి.

 

సాధారణం గా పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయిలు లావు అయిపోతారు. కానీ సమంత మాత్రం సినిమాకి ఎలా కావాలంటే అలాగ తన శరీరాన్ని మలుచుకుంటూ మిగతా హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. సమంత నాజూకుగా కావడంలో చైతన్య పాత్ర కూడా చాలా ఉంది అనే చెప్పాలి. అతను తనకు నచ్చింది చేయమని ఎటువంటి ఆంక్షలు విధించకుండా నాగ చైతన్య ప్రోత్సహించడమే ఇందుకు కారణం. సమంతను సమంత లాగా ఆమె భర్త ఉండం ఇవ్వడమే జాను కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది.. సినిమా ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: