విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన 96 చిత్రం తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెర‌గ‌రాని ముద్ర వేసింది. ముఖ్యంగా కొన్ని సినిమాలు తెలియకుండానే మనలో కలిసిపోతుంటాయి. అలాంటి సినిమా 96 అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే తమిళ హిట్ మూవీ '96' రీమేక్‌గా తెలుగులోసమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన సినిమా జాను. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్‌ యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. 

 

దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్‌లో ఇప్పటికే ‘జాను’ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే శర్వానంద్, సమంత కూడా పూర్తిగా విజయ్, త్రిష పాత్రలను ఓన్ చేసుకున్నారు. సొంత స్టైల్ కూడా కనిపిస్తున్నా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు జాను కొత్తగా అనిపించదు. అంత‌గా స‌మంత ప్రేక్ష‌కుల‌ను అక‌ట్టుకుంటుంది. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 

 

సినిమా కాస్త నెమ్మ‌దిగా సాగినా మంచి ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మరో లోకంలోకి తీసుకెళ్తుంది. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్‌తో సినిమా మొదల‌వుతుంది. ఇక ఆ తరవాత వచ్చిన ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా సమంత తన పెర్ఫార్మన్స్ తో అందరి కళ్ళు చెమర్చేలా చేసింది. ఊహించినట్టే హ్యాపీ ఎండింగ్ అయితే కాదు కానీ.. ఆ ఎమోషన్ మనతో అలానే ఉండిపోతుంది. దానికి కారణం ప్రతి ఒక్కటి లైఫ్ లో ఇలా జరిగి ఉంటుంది కాబ‌ట్టి. మ‌రి ఈ సినిమా ముందు ముందు ఎంత వ‌ర‌కు హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: