సమంత శర్వానంద్ జంటగా నటిస్తున్న సినిమా ‘జాను’. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. తతమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిషలు ఈ సినిమాలో నటించారు అనేకంటే జీవించారు అనే చెప్పాలి. రామ చంద్రన్ ‘రామ్’ పాత్రలో విజయ్ సేతుపతి, జానకి ‘జాను’ పాత్రలో త్రిష మెస్మరైజ్ చేశారు. అక్కడ ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. ఇక తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. 

 

చిన్నప్పుడు స్కూల్లో ఒకే తరగతి గదిలో చదువుతున్నప్పుడు ఇద్దరి మధ్య చూపులతో మొదలైన వారి ప్రేమ ఎలా సాగుతుంది. కాలేజీ సమయానికి వేరుపడిన ఆ జంట, మళ్ళీ ఎన్నో ఏళ్లకు ఒక 'గెట్-టుగెదర్' వేడుకలో కలుస్తున్నప్పుడు కలిగే భావోద్వేగం, ఆ వేడుకలో ఇద్దరు చూసుకున్న మొదటి క్షణం, దగ్గరికి వస్తున్నప్పుడు పెరిగే గుండె వేగం ఇలా అన్నీ భావోద్వేగాలను తట్టే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న(నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా కాస్త నెమ్మ‌దిగా సాగినా మంచి ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మరో లోకంలోకి తీసుకెళ్తుంది. 

 

అలాగే కథ- కథనంను ఎలాంటి కల్తీ చేయకుండా మరోసారి ఆ అందమైన కావ్యాన్ని అంతే తాజాగా ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు. ముఖ్యంగా స‌మంత ఫీల్‌గుడ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్లు, క్లైమాక్స్ ఇలా ఓవ‌రాల్‌గా మ‌న స్కూల్ డేస్‌లో ప్ర‌తి అమ్మాయి స‌మంత‌ను ఊహించుకుంటుంది. స‌మంత అదిరిపోయే న‌ట‌న వ‌ల్ల‌ సినిమా అయిపోయాక కూడా ఆమె మ‌న‌కు గుర్తుకు వస్తూనే ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఫీల్ ద మ్యాజిక్ అనిపించింది జాను చిత్రం. కాగా, ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే శర్వానంద్, సమంత హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నారు. సినిమా స్లోగా ఉన్నా కూడా కచ్చితంగా మనసును దోచేలా ఉందంటున్నారు ఆడియన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: