తమిళంలో విజయం సాధించిన ౯౬ సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండేళ్ల క్రితం విడుదలై అక్కడి ప్రేక్షకులని మాయలో పడేసింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రీమేక్ జాను తెలుగు ప్రేక్షకులని ఈరోజు పలకరించింది.

 

 

శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ రీమేక్ తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు అలరించగలిగిందో ఇప్పుడు చూద్దాం.. ఒరిజినల్ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ జాను సినిమాకి దర్శకత్వం వహించాడు. ౯౬ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే జాను సినిమాకి వర్క్ చేశారు. క్లాసిక్ గా మిగిలిపోయిన దాన్ని మళ్ళీ రీ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఎంత ఒరిజినల్ డైరెక్టర్ అయినా కూడా తీసిన దాన్ని మళ్ళీ అదే రకంగా తీయలేడు. 

 

 

కానీ సి ప్రేమ్ కుమార్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. జాను సినిమా మంచి ఎమోషన్ తో సాగే లవ్ డ్రామా.. సమంత శర్వానంద్ పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి మధ్య సాగే సీన్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. స్కూల్ లవ్ మొదలుకుని వారు మళ్లీ కలుసుకున్నప్పుడు సాగిన సన్నివేశాలు చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. జానుగా చేసిన జూనియర్ సమంతకి మంచి మార్కులు పడతాయి.

 

 

సినిమా ఎమోషనల్ గా బాగున్నప్పటికీ స్లోగా సాగే నెరేషన్ వల్ల కొంత నెమ్మదిస్తుంది.. ఇదివరకు తమిళంలో ఒరిజినల్ వెర్షన్ చూడనివారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన వారు కంపేరిజన్ లో పడిపోతారు కాబట్టి సినిమాని బాగా ఎంజాయ్ చేయలేరు. మొత్తానికి సినిమా ఒక మెమరబుల్, ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా.. మళ్లీ మళ్ళీ గుర్తుండిపోయేదిగా మాత్రం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: