ఆనాటి అగ్ర స్థాయి హీరో నేటికీ మమ్మలిని మెప్పిస్తూనే ఉన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు ధీటుగా నిలుస్తున్నాడు ఈ హీరో. పాతికేళ్ల ముందు ఎంత ఉత్సహంగా ఉండేవారో ఎప్పుడు అలాగే ఉంటున్నాడు. సినీ పరిశ్రమకు కొత్త తరం హీరోలు పరిచయమైతున్న తనకు ఉన్న ఇమేజ్ ని ఏమాత్రం తగ్గించటం లేదు. తన సినిమాలు హిట్ అయిన ప్లాఫ్ అయినా అతను మాత్రం సినిమా తీయటంలో మాత్రం వెనుకాడడం లేదు. అభిమానులను నిరాశ పరచకుండా ఎప్పుడు ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నందమూరి బాలకృష్ణ.

 

నందమూరి బాలకృష్ణ హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “రూలర్”. బాలకృష్ణ నటించిన “యన్.టి.ఆర్, రూలర్ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దింతో అప్పటికే “జైసింహా” చిత్రంతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన దర్శకుడు కావడంతో “రూలర్” చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి బయట కొచ్చిన బాలయ్య లుక్స్ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో అంతే స్థాయిలో ట్రోల్స్ కూడా చెయ్యబడ్డాయి.

 

ఒక లుక్ కి మరో లుక్ అసలు సంబంధం లేకుండా ఉండేసరికి దానికి తోడు రొటీన్ స్టోరీ కావడంతో సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం దారుణ పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. అయితే బుల్లితెర మీద మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉంది అనిపిస్తుంది.ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 9 ఆదివారం రోజున జెమినీ టీవిలో ప్రసారం చేయబోతున్నామని వారు తెలిపారు. అందులో భాగంగా దీనికి ప్రమోషన్స్ మొదలు పెట్టగా తమ వీక్షకులను రెస్పాన్స్ భారీగానే వస్తుంది. అయితే ఈ రెస్పాన్స్ ఒక్క సోషల్ మీడియా వరకేనా లేక టీఆర్పీలలో కూడా ఏమన్నా సత్తా చాటుతుందా అన్నది తెలియాల్సి ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: