‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే ఏడాది జనవరి కి వాయిదా పడటంతో జూనియర్ తన కలలో కూడ ఊహించని ఒక కొత్త రికార్డ్ అందుకున్నాడు అంటూ ఇప్పుడు జోక్స్ పడుతున్నాయి. జూనియర్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు గడిచిపోయింది. 


మొదట్లో చాల వేగంగా సినిమాలు చేసిన జూనియర్ తనకు టాప్ హీరో స్టేటస్ వచ్చిన తరువాత తన వేగాన్ని తగ్గించుకుని ఖచ్చితంగా తన వైపు నుండి సంవత్సరానికి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. 2018 దసరా రేసుకు వచ్చిన ‘అరవింద సమేత’ తరువాత జూనియర్ రాజమౌళి బంధిఖానాలోకి వెళ్ళి పోవడంతో గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడ జూనియర్ నుండి సినిమాలు లేని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతోంది. 


ఒక టాప్ హీరో రేంజ్ వ్యక్తికి రెండేళ్ళ పాటు ఏ సినిమా లేకుండా దూరంగా ఉండటం అంటే అభిమానులతో చాల గ్యాప్ ఏర్పడుతుంది. దీనికితోడు జూనియర్ సోషల్ మీడియాలో కూడ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కనీసం ఫిలిం ఫంక్షన్స్ లో కూడ జూనియర్ కనిపించడం లేదు. దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ నమ్ముకుని జూనియర్ తన విలువైన రెండు సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకుంటున్నాడు అంటూ తారక్ అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నారు. 


అంతేకాదు అంచనాలకు అనుగుణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయం సాధించినా ఆ ఖ్యాతి రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోతే జూనియర్ చేసిన త్యాగానికి ఏమి విలువ ఉంటుంది అంటూ కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వాయిదా విషయం తెలుసుకుని తీవ్ర నిరాశ పడుతున్నారు. అయితే రాజమౌళి జూనియర్ ల కెరియర్ ఒకే సినిమాతో మొదలైన పరిస్థితులలో వీరిద్దరి సాన్నిహిత్యాన్ని ఈ గ్యాప్ వీరిద్దరిని మరింత దగ్గర చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: