టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, చిన్న వయసులోనే బాలరామాయణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అనుకుంది. ఇక పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా మారిన ఎన్టీఆర్, అక్కడి నుండి ఒక్కొక్కటిగా తనకు వస్తున్న సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఇక చిన్నప్పుడే కూచిపూడి నాట్యంలో మంచి ప్రావిణ్యం సాధించిన జూనియర్, సినిమాల్లోకి ప్రవేశించిన తరువాత తన డాన్స్ లతో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించసాగారు. 

 

మొదట్లో ఎంతో బొద్దుగా ఉన్నప్పటికీ కూడా డ్యాన్సులు అదరగొట్టిన ఎన్టీఆర్, అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా తరువాత బాగా సన్న బడ్డారు, ఇక అక్కడి నుండి మరింతగా డ్యాన్సర్ గా ఇరగదీసిన ఎన్టీఆర్, ఎప్పటికప్పుడు తన సినిమాల్లో అలరించే డ్యాన్స్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ కి కిక్క్ ఎక్కిస్తున్నారు. ఇక నేడు రిలీజ్ అవుతున్న సవారీ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆ సినిమా నటుడు నందు, ఎన్టీఆర్ డ్యాన్స్ ల గురించి ఒక ఆసక్తికరమైన వార్తను చెప్పాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రభస సినిమాలోని ఒక సాంగ్ షూటింగ్ సమయంలో డాన్స్ మాస్టర్, ఎన్టీఆర్ కోసం దాదాపుగా ఒకరోజంతా ప్రాక్టీస్ చేసిన ఒక రెండున్న నిమిషాల స్టెప్ ని, 

 

షాట్ ఓకే అయి రెడీ అయిన ఎన్టీఆర్, కేవలం ఒకే ఒక్క టేక్ లో చేయడం చూసి సినిమా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆశ్చర్యపోయిందని, నిజానికి ఎన్టీఆర్ డ్యాన్సుల్లో కింగ్ అనే విషయం అందరికి తెలిసినప్పటికీ, ఆయన మరింత గొప్ప డ్యాన్సర్ అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పాడు. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం నందు, ఈ విధంగా ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని కొందరు అంటున్నప్పటికీ, ఒకరకంగా నందు సవారీ చేయడానికి ఎన్టీఆర్ పేరు ఈ విధంగా ఉపయోగపడేలా ఉందని అంటున్న వారు కూడా ఉన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: