ధనవంతులు కావాలని కలలు కనేవాళ్ళు అంతా ఒక ప్రధాన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సంపాదన సంపద ఒకటి కావు. బాగా సంపాదించే వారు అంతా సంపదను సృష్టించ లేరు. సంపదను సృష్టించాలి అంటే క్రమంతో కూడుకున్న ప్రణాళిక ఉండాలి. మన డబ్బు మన కోసం పని చేసినప్పుడే సంపద సృష్టి జరుగుతుంది.


ప్రతిరోజు ఎక్కువ గంటలు పనిచేస్తే సంపద వస్తుంది అని అనుకోవడం అవివేకం మన దగ్గర ఉన్న డబ్బు మనకు మరింత డబ్బును తెచ్చి పెట్టె విధంగా ఆ డబ్బును చాల తెలివిగా వివిధ పెట్టుబడి మార్గాలలో షేర్లు మ్యూట్యువల్ ఫండ్స్ లో నిపుణులైన వ్యక్తుల సలహాలు తీసుకుని తెలివిగా పెట్టుబడి పెట్టాలి అప్పుడే ఒక రూపాయి పది రూపాయలు అవుతుంది. పేదవాళ్ళు అంతా తాము డబ్బుకోసం కష్టపడాలి అనుకుంటారు. అయితే తెలివైన వాళ్ళు మాత్రం తమ డబ్బు తమ కోసం కష్ట పడాలని చాల తెలివిగా వ్యవహరిస్తారు.


ఏ రంగంలో అయినా 80 శాతం సంపద 20 శాతం మందికి సొంతం అవుతుంది. ఈ ఇరవై శాతం మంది బాగా కష్టపడే కన్నా చాల తెలివిగా తమ డబ్బును తమకోసం ఉపయోగపడుతూ మరింత గణించే విధంగా పెట్టుబడులు పెట్టే విషయాలో నేర్పరితనం ఉన్నవారు. దీనికి ముఖ్యంగా కావలసింది నైపుణ్యం ఆ నైపుణ్యం మన దగ్గర లేదు అని విచారించే కన్నా ఆ నిపుణుత పెంచుకోవడం కోసం తెలివిగా ఆలోచించాలి అంటూ ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త విల్ ఫ్రెడ్ పెరాటో అభిప్రాయ పడుతున్నారు.


ఆదాయం నిరంతరం పొందాలి అంటే ఒక పైప్ లైన్ లాంటి ఆదాయ వ్యవస్థను మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఒకసారి చేసిన పనికి నిరంతరం ఆదాయం వచ్చేడట్లుగా మన నైపుణ్యాలు మెరుగు పరుచుకుని పనులు చేయగలిగితే మన మనీ పైప్ లైన్ వ్యవస్థ జీవితాంతం పని చేస్తూనే ఉంటుంది. ప్రపంచంలోని ధనవంతులు అంతా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: