రెండేళ్ల క్రితం తమిళ్ లో తెరకెక్కిన 96 మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు సి ప్రేమ్ కుమార్ అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించడం జరిగింది. హృద్యమైన ప్రేమకథగా ఎంతో ఎమోషనల్ వే లో సాగె ఈ సినిమాకు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాని శర్వానంద్, సమంత హీరో

 

హీరోయిన్లుగా దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. తమిళ మూవీ ని తీసిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ కు కూడా దర్శకత్వం వహించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. హృదయానికి హత్తుకునే ప్రేమకథగా సాగిన ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్స్ లో శర్వా, సమంత ఎంతో ఒదిగిపోయి నటించారని, అలానే ఒరిజినల్ తమిళ్ వర్షన్ మాదిరిగానే ఈ సినిమాకు కూడా ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని టాక్ వినపడుతోంది. తొలి ప్రేమ యొక్క మ‌ధురానుభూతి, 

 

అందులోని ఆనందాన్ని పెదవులపై నవ్వుగా, కలుసుకోలేక విడిపోయిన బాధని కళ్ళు చెమ్మగిల్లేలా చేసే ఎమోషనల్ లవ్ డ్రామానే ఈ జాను. ఇలాంటి పూర్తి ఎమోషనల్ ప్రేమ కథా చిత్రాలు తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఇక ఎటువంటి కమర్షియల్ హంగులు, ఆర్భాటాలు లేకుండా, కేవలం బలమైన కథ, కథనాలను బేస్ చేసుకుని ప్రేక్షకులను కదిలించేలా సాగిన ఈ ప్రేమ కథకు ముఖ్యంగా యువత మంచి స్పందనను అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల నుండి మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: