పాన్ ఇండియా బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదాపడిన విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని ఈఏడాది జులై 31న విడుదలచేస్తామని ప్రకటించారు అయితే షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ కావడంతో  విడుదల వాయిదాపడుతుందని  ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే కొద్దీ రోజుల క్రితం  మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 8న  ఆర్ఆర్ఆర్ ను విడుదలచేస్తామని  ప్రకటించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.  క్వాలిటీ కోసమే ఇంత టైం తీసుకుంటున్నామని  చిత్ర యూనిట్ చెపుతుంది.
 
ఇక ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా జాయిన్ అయ్యాడు. ఈలాంగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ , అజయ్ దేవగణ్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా  తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఒక్క నెల్లూరు తప్ప మిగితా అన్నిఏరియాల్లో  థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యిందని సమాచారం. ఈరెండు రాష్ట్రాల్లో కలిపి ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ హక్కులు 300 కోట్లకు అమ్ముడైయ్యాయట.. కేవలం నైజాంలోనే ఈ చిత్రం 75కోట్ల బిజినెస్ చేసింది. దిల్ రాజు ఈ హక్కులను దక్కించుకున్నాడు.
 
ఈలెక్కన ప్రపంచ వ్యాప్తంగా కేవలం థియేట్రికల్ రూపంలోనే ఈ చిత్రం 600-700కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రల ఆధారంగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: