బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్లీస్టారర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021న విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించాడు. సినిమాపై అంచ‌నాల నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ కోసం అగ్ర శ్రేణి పంపిణీదారులు మూవీ పంపిణీ హక్కులను పొందడానికి పోటీపడుతున్నారు. దిల్ రాజు తాజాగా ఆర్ఆర్ఆర్ నిజాం హక్కుల కోసం రాజమౌళి టీం కోసం భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 75కోట్లను నైజాం హక్కుల కోసం ఆఫర్ చేసినట్టు సమాచారం. నైజాంలో ఇప్పటివరకూ ఏ సినిమా కూడా 70కోట్ల వసూళ్లు సాధించలేదు. బాహుబలి 2 మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది. అందుకే ఆర్ఆర్ఆర్ పై దిల్ రాజు భారీగానే ఆఫర్ చేస్తున్నారు.

 

ఆర్‌. ఆర్‌. ఆర్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్ప‌టికే మొద‌లైంది. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రి ఈ చిత్రం పై అంత భారీ మొత్తంలో డ‌బ్బులు పెడితే ఖ‌చ్చితంగా తిరిగి వ‌స్తాయ‌ని దిల్‌రాజు అంత‌లా న‌మ్ముతున్నారా. రాజ‌మౌళి పైన పెద్ద న‌మ్మ‌క‌మే పెట్టుకున్నాడు. ఇద్ద‌రు టాప్ స్టార్లు  క‌లిసి చేయ‌డంతో ఆ మాత్రం క‌లెక్ష‌న్లు అనేవి స‌ర్వ సాధార‌ణం అని భావిస్తున్నట్లు స‌మాచారం. ఇక ఈ చిత్రానికి ఓపెనింగ్స్ గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. అంతేకాక ఈచిత్రానికి ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. 

 

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్  సినిమా స్టోరీ ఏంటీ, యుద్ధ సన్నివేశాలు, షూటింగ్ లొకేషన్లు, సాంగ్స్, పైట్స్  సన్నివేశాలు లీక్ అవ్వకుండా రాజ‌మౌళి ఈ చిత్రం విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకి గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో మూడు పాటలు రాయించుకుంటున్నాడు. బాహుబలికి రాజమౌళి ఏం  స్ట్రాటజీని అప్లయ్ చేశాడో ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు స్టోరీని, చిత్ర విశేషాలు,షూటింగ్ స్పాట్స్ గురించి ఎక్కడా డిస్కస్ చేయకూడదని చెప్పాడు రాజమౌళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: