స్వయంకృషి తో పైకొచ్చిన చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఆదర్శప్రాయం..అందుకే ఇటీవల జరుగుతున్న సినిమా ఫంక్షన్ అయిన ఈవెంట్ అయినా కూడా చిరంజీవి వచ్చి సందడి చేస్తుంటారు ఆ సినిమా కూడా హిట్ గా నిలుస్తుంది. అయితే చిరంజీవి వల్ల మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు స్టార్ హీరోలుగా రాజ్యమేలుతున్నారు. అయితే మెగా డాటర్ నిహారిక కూడా వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాలలోకి వచ్చింది.

 

అయితే ఈ అమ్మడుకు మాత్రం సినిమాలు పెద్దగా పేరును తీసుకురాలేదన్న విషయం తెలిసిందే. అయినా కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా వెబ్ సిరీస్ ద్వారానో లేక సోషల్ మాధ్యమాల ద్వారానో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య సినిమా ఆఫర్ల కోసం ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ పరువును తీస్తుందని ఆరోపణలు వినపడుతున్నాయి..

 

అందరి అంచనాలను తల్లక్రిందులు చేసి, హీరోయిన్ గా మెగా డాటర్ నిహారిక చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పటి వరకు కూడా నిహారిక కి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు నిహారిక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత ఉండాలనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు నిహారిక అందాలను ఆరబోస్తూ ఉంది..

 

ఇప్పటివరకు కూడా సినిమాల్లో చాలా హద్దుల్లో కనిపించిన నిహారిక, బయట మాత్రం ఫోటోల్లో చాలా రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే నిహారిక కూడా అందరి హీరోయిన్ల మాదిరి తన అందాలను ఆరబోసే పనిలో పడిపోయిందని అర్థమవుతుంది. అయితే ఆ ఫోటోలు చూసినటువంటి మెగా అభిమానులందరూ నిహారిక పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వంటి పెద్ద కుటుంబంలో నుండి వచ్చి ఇలా ఆమె చేయడం చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. మరి ఈ విషయం పై కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: