జబర్దస్త్ షోలో తన కామెడీతో అలరిస్తున్న హైపర్ ఆది పంచులకు ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వాల్సిందే. ఆది వేసిన పంచుల కోసమైనా షో చూడాల్సిందే అనేంతగా నవ్విస్తాడు. ఎప్పటిలానే ఈ వారం కూడా హైపర్ ఆది సూపర్ పంచులతో తన స్కిట్ పండించాడు. సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలను కవర్ చేస్తూ ఆది వేసిన లేటెస్ట్ స్కిట్ సూపర్ హిట్ అయ్యింది. ఇక పనిలో పనిగా ట్రెండింగ్ టాపిక్స్ మీద పంచులేయడం ఆదికి అలవాటే.

 

ఈ క్రమంలో ఈ షో నుండి బయటకెళ్లిన టీం లీడర్స్, జడ్జ్ నాగబాబు మీద కూడా పంచులేశాడు హైపర్ ఆది. లేటెస్ట్ స్కిట్ లో ఓ వ్యక్తి ఆది మరదళ్లని కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. ఆది అల వైకుంఠపురములో అల్లు అర్జున్ లా సిత్తరాల సిరిపడు సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి పంచులేస్తాడు. అంతేకాదు వీళ్లను వాళ్లనే కాదు అందరిని తీసుకేళ్లి నువ్వు కూడా ఓ షో పెట్టు బెదిరింది అని అంటాడు. అయితే ఈ పంచు డైరెక్ట్ గా మెగా బ్రదర్ నాగబాబుని ఉద్దేశించే అని కొందరు అంటున్నారు.

 

జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన హైపర్ ఆది అదిరింది షో చేస్తున్నారు. చమ్మక్ చంద్ర, ఆర్పి లను జబర్దస్త్ నుండి తీసుకెళ్లి ఈ షో చేస్తున్నారు. ఆది వేసిన పంచ్ చూస్తే జీ తెలుగులో వస్తున్న అదిరింది షో మీద వేసినట్టుగా ఉంది. జబర్దస్త్ లో ఉన్నంత సేపు నాగబాబుని పొగుడుతూ పంచులేసిన ఆది ఇలా ప్లేట్ మార్చేయడం అందరికి షాక్ ఇస్తుంది. తను పవర్ స్టార్ అని చెప్పుకుంటూ మెగా బ్రదర్ పై సెటైర్ వేయడం పై అందరు షాక్ అవుతున్నారు. మరి ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: