ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలు ఎక్కువయ్యాయి. రొమాన్స్ లేకపోతే ఆ.. సబ్జెక్టు హిట్ అవ్వడం కష్టం అంటోంది డిగ్రీకాలేజ్ చిత్ర యూనిట్. వరుణ్, దివ్యా రావు హీరో హీరోయిన్లుగా టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్లో డిగ్రీ కాలేజ్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా విడుదలకు ముందే వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
(వరుణ్) పార్వతి (దివ్యా రావు) ఒకే కాలేజీలో చదువుకుంటారు. పేదవాడైన తక్కువ వర్గానికి చెందిన శివ హోదా పలుకుబడి కలిగిన పోలీస్ అధికారి కూతురు పార్వతిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన పార్వతి తండ్రి వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. దీనితో శివ పార్వతి లేచి పోయి పెళ్లి చేసుకుంటారు. దీనితో రగిలిపోయిన పార్వతి తండ్రి తీవ్రంగా వెతికి కూతురు పార్వతిని పట్టుకొస్తాడు. మరి శివ మళ్ళీ ఆమెను కలిశాడా? పార్వతి తండ్రి మనసు మారిందా? వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.
ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని సీన్లు డిగ్రీ కాలేజ్ సినిమాలో సీన్లు హీరో హీరోయిన్లు చేసినది రొమాన్సా... సెక్సా అన్న విమర్శలు వస్తున్నాయి. డిగ్రీ కాలేజ్ సినిమా ఇవాళ విడుదల అయింది. ప్రమోషన్లలో భాగంగా అశ్లీల ఫోటోలను రోడ్లపై అతికించడంతో రచ్చరేగుతోంది. అంతేకాకుండా బస్ స్టాండ్ లలో ఈ అశ్లీల ఫోటోలను అతికించడంతో పలువురు ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట చౌరస్తా సమీపంలో అసహ్యంగా ఉన్న ఈ పోస్టర్లను గుర్తించిన స్థానికులు, మహిళాసంఘం వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో దర్శక, నిర్మాతలు నర్సింహనంది, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్లు పోస్టర్లు మరీ చాలా అభ్యంతరంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇలాంటిసినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది అనుకుంటున్నారో దర్శకులు ఏమోగాని ఎక్కువశాతం చిన్న సినిమాలన్నీ బోల్డ్ కంటెంట్‌తోనే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.