బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతి రోషన్ గురించి మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో ఉన్న సినీ ప్రేక్షకుల్లో కూడా ఎంతో పేరుంది. చూడడానికి అచ్చం హాలీవుడ్ హీరోలకు మాదిరిగా అందం, ఫిజిక్ తో కనపడే హృతిక్, తన తొలి సినిమా కహో నా ప్యార్ హై నుండి, మొన్నటి వార్ సినిమా వరకు ఒక్కొక్క సినిమాతో మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మధ్యలో విజయాలతో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా చవి చూసారు. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన హృతిక్, కష్టపడితే ఏదైనా మనిషి సాధ్యమే అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన వార్ సినిమాకు ముందు, గడచిన కొన్నేళ్లుగా హృతిక్ కు సరైన సక్సెస్ అయితే లేదని చెప్పాలి. నిజానికి కొన్నాళ్ల క్రితం హృతిక్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ 30 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ విజయాన్ని మాత్రమే దక్కించుకుంది. 

 

ఇక దానితరువాత హృతిక్, మరొక హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి వార్ సినిమాలో ఇటీవల నటించారు. అయితే ఆ సినిమా కోసం హృతిక్ పడిన కష్టం గురించి తెలిస్తే నిజంగా ఎవరి గుండె అయినా తరుక్కుపోతుంది. అంతక ముందు కొన్నాళ్ల క్రితం హృతిక్ కు ఒక ఆపరేషన్ జరగడం, అలానే సూపర్ 30 సినిమా కోసం కొంత నాచురల్ గా కనపడడం కోసం హృతిక్ పెద్దగా ఎక్సర్ సైజు లు చేయకపోవడం వాటి వలన తన ఆరోగ్యం పై పెద్దగా శ్రద్ధ పెట్టలకేపోయారుట. ఇక ఆ వెంటనే వార్ సినిమా అవకాశం రావడం, అలానే ఆ సినిమాలో రా ఆఫీసర్ పాత్రలో నటించాల్సి ఉండడంతో, అందుకోసం మళ్ళి తన బాడీని మంచి షేప్ కి తెచ్చి ఫిట్ గా ఉంచాల్సిన సమయం హృతిక్ కి వచ్చింది. 

 

ఇక అందుకోసం ప్రత్యేక జిమ్ నిపుణుడిని నియమించుకుని దాదాపుగా మూడు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్న హృతిక్, చాలా సమయం జిమ్ లోనే గడపవలసి వచ్చిందని, అలానే ఆ సమయంలో మానసికంగా ఎంతో దృఢంగా తయారు కావడానికి తన మనసుని కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే వాడినని చెప్పిన హృతిక్, మళ్ళి తనకు ఆరుపలకల దేహం రావడానికి ఫుడ్ విషయంలో, జిమ్ చేసే విషయంలో పాటించే నియమాలకు తనకు నరకం కనపడేదని, అయినప్పటికీ తన దృష్టి మాత్రం వార్ లో తన పాత్ర కోసం సిద్ధం అవ్వాలి అనే దానిపైనే ఉండేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో హృతిక్ చెప్పుకొచ్చారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: