సినిమా స్టార్స్, సెలబ్రిటీలకు ఏమాత్రం కాస్త ఖాళీ దొరికినా కూడా విదేశాలకు ఫ్లైటెక్కేయాలని చూస్తుంటారు. హాయిగా ఒక 4-5 రోజుల పాటు విదేశాల్లో సరదాగా రిలాక్స్ అయ్యాక తిరిగి షూటింగ్ స్పాట్ కు వచ్చేస్తుంటారు. అలా తనకు టైమ్ దొరికితే ఇండోనేషియాలోని బాలికి వెళ్తానంటోంది కాజల్. తన ఆల్ టైమ్ ఫేవరెట్ స్పాట్ బాలి అని చెప్పింది. "నా బెస్ట్ హాలిడే స్పాట్ బాలి. నా బెస్ట్ ఫ్రెండ్స్ దివ్య, ప్రియాంకతో కలిసి బాలీలో చేసిన హాలిడే ట్రిప్ నా ఫేవరెట్. కొత్త ఏడాదిలో మరిన్ని దేశాలు చుట్టేయాలని ఉంది. కనీసం 4-5 హాలిడే ప్లాన్స్ ఉన్నాయి." అంటూ ఎగ్జైటింగ్ గా అంటోంది కాజల్.

 

ఇలా తన బెస్ట్ హ్యాంగవుట్ ప్లేస్ ను బయటపెట్టింది కాజల్ అంటే దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అని చాలా మంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎప్పుడు కాస్త ఒత్తిడిగా అనిపించిన సందర్భాలేవీ లేవని అంటోంది కాజల్. ఒత్తిడి ఫీల్ అయితే మన సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురాలేమనేది కాజల్ అభిప్రాయపడుతోంది. అసలే పోటీ ప్రపంచం. సంవత్సరానికి అరడజను కి పైగా కొత్త అమ్మాయిలు హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. అంతమందిని తట్టుకోవాలంటే ఒత్తిడి ఫీలవ్వకూడదు అంటోంది.

 

అయితే వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సార్లు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలాసార్లు ఫిజికల్ గా, కొన్ని సార్లు మెంటల్లీ ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నా ఫీల్డ్ లో అది తప్పనిసరి. కానీ నేను ఆ ఒత్తిడిని తట్టుకుంటాను... అని సెలవిచ్చింది ఈ అమ్మడు. ఇక కాజల్ ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తూ బిజీగానే ఉంది. ప్రస్తుతానికైతే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని మరిన్ని మంచి సినిమాలు చేస్తానని అంటోంది...అంటే దీని అర్థం ఇప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని. 

మరింత సమాచారం తెలుసుకోండి: