తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా 96. ఈ సినిమాకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా వచ్చిన సినిమా జాను. తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష నటించిన ఈ సినిమాలో ప్రేకులు లీనమయి పోయారు. ప్రతి ఒక్కరి మనసును తాకేలా ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకే అక్కడ మంచి సక్సస్ ను అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అయి జాను టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో శర్వానంద్ సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే.

 

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటుందన్న టాక్ వచ్చింది. కంప్లీట్ కల్ట్ కంటెంట్ కాబట్టి కామన్ ఆడియన్స్ లో కొంత శాం మాత్రమే ఆసక్తి చూపిస్తారట. ఇక ఈ సినిమాని తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు సి.ప్రేం కుమార్ తెలుగులోనూ తెరకెక్కించడంతో ఎలాంటి మార్పులు చేయకుండా అలా దింపేశాడు. దీంతో ఈ సినిమాలో ఫీల్ ఎక్కడా మిస్ కాలేదు. కానీ అది ఎంతవరకు ప్రేక్షకులను కనెక్ట్ అవుతుందో రెండు రోజులాగితే గాని క్లారిటి వచ్చే అవకాశం ఉంది. 

 

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమాలో స్కూల్ డేస్లో ప్రేమించిన అమ్మాయి తర్వాత పెరిగి పెద్దయి మిడిల్ ఏజ్ వచ్చాక కలిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో లవ్ ఫీల్ ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు చాలా నీట్ గా చూపించడం సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ సమంత నటనకు అందరూ ఫ్లాటైపోతున్నారు. సమంత శర్వానంద్ తప్ప సినిమాలో ఆకట్టుకునే మరో అంశం లేకపోవడం విశేషం. ఇదొక పెద్ద సాహసమే అని చెప్పాలి.

 

అయితే ప్రస్తుతం వస్తున్న టాక్ పరంగా చూస్తే 50-50 గా ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. మేయిన్ గా సమంత ఇమేజ్ తోనే సగం జనాలు థియోటర్స్ కి వస్తున్నారట. వాస్తవంగా చూస్తే అది నిజమని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే శర్వా కి అసలు ఈ మధ్య సరైన హిట్స్ లేకపోవడంతో పెద్దగా మార్కెట్ కూడా లేదు. ఆ ఇంపాక్ట్ కూడా సినిమా మీద పడిమంది. ఇక దిల్ రాజు గనక ఇంకా కాస్త ప్రమోషన్స్ చేసి ఉంటే సినిమాకి ఉపయోగపడేది. అది కూడా మరో మైన్స్. కానీ ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు ఎప్పటికో గాని రావు. అది మాత్రం వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: