2017 లో సంక్రాంతికి టాలీవుడ్ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ శతమానం భవతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సస్ ని అందుకున్నాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఆ తర్వాత వచ్చిన రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం సినిమాలు ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దాంతో శర్వా రేస్ లో చాలా వెనక బడిపోయాడు. దాంతో పెద్ద కన్‌ఫ్యూజన్ లో ఉన్న శర్వా నెక్స్ట్ ఏ సినిమా చేయాలో తెలియని డైలమాలో పడిపోయాడు. వినడానికి 5-6 కథలు విన్నప్పటికి ఏ కథ చేయాలో ఎలాంటి కథ తో వస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో తెలియక ఆలోచిస్తున్న సమయంలో దిల్ రాజు సినిమాని ఆఫర్ చేశాడు. అదే తాజాగా రిలీజైన జాను.

 

దిల్ రాజు బ్యానర్ అనగానే శర్వానంద్ ఒక్కసారిగా ఉలిక్కి పడి వెంటనే ఒకే అన్నాడు. అలా అనడానికి కారణం నిర్మాత దిల్ రాజు సినిమా తమిళ్ సూపర్ హిట్ 96. ఇక హీరోయిన్ సమంత. దాంతో తనకి సూటవుతుందా లేదా. లేక సమంత పక్కన నన్ను ప్రేక్షకులు చూడగలుగుతారా, నేను డామినేట్ అవుతానా...ఇలాంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో సినిమా కంప్లీటయి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్లోగా ఉంది. మన నేటివిటీ కాదు. అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు..ఇలాంటి మాటలు వినిపిస్తున్నప్పటికి కాస్త పాజిటివ్ టాక్ కూడా వచ్చింది.

 

ముఖ్యంగా శర్వా నటన మీద మంచి కాంప్లిమెంట్స్ పడుతున్నాయి. కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు శర్వా అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు సమంత ని బాగా బ్యాలెన్స్ చేశాడని కితాబులిస్తున్నారు. ఇక ఇలాంటి కథలో ఇమిడిపోవడం చాలా కష్ఠం అయినప్పటికి ఇద్దరు ఆ కష్టాన్ని చాలా ఈజీగా దాటేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక శర్వాని సమంత బాగా సపోర్ట్ చేసిందని తన పక్కన శర్వా అన్నప్పటికి సినిమాని ఒప్పుకోవడం సమంత లోని గొప్పతనం అని అక్కినేని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇదే విషయంలో శర్వానంద్ సమంతకి కృతజ్ఞతలు తెలిపాడట. ఈ సినిమా హిట్ అయితే అది ముందు సమంత వల్లే అని చెప్పుకుంటారు. ఆ తర్వాత శర్వానంద్ గురించి చెప్పుకుంటారు. ఈ సినిమా సక్సస్ కి సమంత సపోర్ట్ చాలా ఉందని ఈ విషయంలో చైతూ ఏమనుకున్నా నిన్ను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటానని లేదంటే నేను మనిషినే కాదంటూ సమంతకి తెగ కృతజ్ఞతలు చెబుతున్నాడట శర్వా. అంతేకదా మత్రి. శర్వా తో సమంత సినిమా ఒప్పుకోవడం అంటే గొప్పే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: