తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో హీరో నిఖిల్ ఒక‌రు. మా నాన్న ఎమ్మెల్యే అంటూ  హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్  యువత, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాలతో హిట్ కొట్టాడు. ముఖ్యంగా స్వామి రారా నుంచి ఈయన కెరీర్ మరో టర్న్ తీసుకుంది. అయితే వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త అడుగు వేస్తున్నాడు. ఇటీవ‌ల అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్.. ఇప్పుడు జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు తెర తీస్తున్నాడు. అదేనండీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు క‌దా.

 

వాస్త‌వానికి గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న ఉన్న నిఖిల్ ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిఖిల్-పల్లవిల ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో గోవాలో ఫిబ్రవరి 1 పెద్దల సమక్షంలో నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నారు. పల్లవి, నిఖిల్ కలిసి ఉన్న ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. ఇక  ప్రేమికులుగా ఒకరికి ఒకరు బహుమతులిచ్చుకోవడం సహజంగా జరిగేదే. ఈ క్ర‌మంలోనే నిఖిల్ తన ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ ప్రోమాక్స్  కొనిచ్చాడుట. 

 

అలాగే బెంగూళూరులో పల్లవి మెడిసిన్ చదువుతోన్న సమయంలో ఇష్టమైన  చాక్టెట్లు, బొమ్మలు టెడ్డీ బేర్ లు ఇలా ఎన్నో గిఫ్ట్‌లు కొనిచ్చాడ‌ట‌. మ‌రి  ప్రియుడికి ప్రేయసి అందించిన తొలి బహు మతి ఏమిటో అంటే ?  నిఖిల్ కి ఎంతో ఇష్టమైన రొయ్యల కూరను స్వయంగా వండి అందించిందట. ఇంకేం ఉంది? నిఖిల్ లొట్టలేసుకుని రొయ్యల కూర లాగించేసాడుట. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఇలాంటి మధురఘటనలు ఒకొరినొకరు అర్ధం చేసుకోవడానికి ఎంతో దోహదం చేస్తాయి. పెళ్లికి ముందే ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవడం.. తెలుసుకోవడం నేటి కల్చర్ లో ఓ భాగమైపోయింది. కాగా,  ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ2 మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: