టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ ఇటీవల రిలీజ్ అయింది. సొంతంగా స్టోరీ రాసుకొని నాగశౌర్య నటించడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  గతంలో ఆయన సొంత బ్యానర్ లో తీసిన ఛలో మంచి హిట్ అయ్యింది.  ఆ తర్వాత నర్తనశాల ఫ్లాప్ అయ్యింది.  ఈ నేపథ్యంలో ఈసారి మరో మంచి కాన్సెప్ట్ తో అశ్వద్ధామ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  మంచి యాక్షన్ కలగలిపి ఉన్న ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి కలెక్షన్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి వచ్చిన కలెక్షన్లను చూస్తే నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ ఈ సినిమా దక్కించుకున్నట్లు చెబుతున్నారు. 

 

నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మించింది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన అశ్వద్థామ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే, కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గానే ఉన్నాయి. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకున్నా వీక్ డేస్‌లో ఉండే కలెక్షన్స్ ని బట్టే బ్రేక్ ఈవెన్ సాధ్యమా కాదా ? అనేది తేలిపోనుంది. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కాబట్టి ఎక్కడా ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు శౌర్య. రెండు తెలుగు రాష్ట్రాలలో అశ్వద్దామ థియేటర్స్‌ సంఖ్యను పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. తొలివారంలో అశ్వద్థామ రూ. 4.56కోట్ల షేర్ ని రాబట్టింది.

 

ఏరియాలవారీగా కలెక్షన్లు :
నైజాంలో రూ. 1.43కోట్లు
సీడెడ్ రూ. 0.45కోట్లు 
ఉత్తరాంధ్ర రూ. 0.65 కోట్లు
ఈస్ట్ రూ. 0.28 కోట్లు
వెస్ట్ రూ. 0.21 కోట్లు
కృష్ణా రూ. 0.29కోట్లు
గుంటూరు రూ. 0.26కోట్లు
నెల్లూరు రూ. 0.15కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.28కోట్లు
ఓవర్సీస్ రూ. 0.56 కోట్లు  

మరింత సమాచారం తెలుసుకోండి: