ఈ మద్య స్టార్ హీరోల సినిమాల షూటింగ్ సమయంలో ఫ్యాన్స్ సందడి బాగా ఎక్కువైందనే చెప్పాలి.  ముఖ్యంగా తమిళనాట ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ అయ్యాయట.  ఇటీవల రజినీ కాంత్ షూటింగ్ సమయంలో పెద్ద గందరగోళం.. తర్వాత అజిత్ ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమా షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు పడుతున్నా ఏదో ఒక గందరగోళం అవుతూనే ఉన్నాయి. అంతే కాదు షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వడం కూడా జరుగుతున్నాయి. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఐటీ దాడులతో సతంమతమవుతున్న ఈ హీరోకి మరో ఇబ్బంది వచ్చిందట..  విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ అధికారులు ఆయన్ను గంటల తరబడి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.

 


గతంలో మెర్సెల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ డైలాగ్స్ చెప్పినప్పట్నుంచే కేంద్రం ఆయన్ను టార్గెట్ చేసిందనే ప్రచారం సాగుతోంది.  మెర్సెల్ లో త్రిపాత్రాభినయం చేసిన విజయ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా డైలాగ్స్ చెప్పారని బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇందులో ప్రభుత్వం, డాక్టర్లను విమర్శించారని పెద్ద గొడవలే జరిగాయి.  మొత్తానికి సినిమా రిలీజ్ కావడం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం.. రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడం జరిగిపోయింది. కాకపోతే ఈ మూవీలో వివాదాస్పద డైలాగులు తొలగిస్తామని నిర్మాత చెప్పడంతో అప్పట్లో గొడవ సద్దుమణిగింది.

 


ఇప్పటికే  ఐటీ దాడులతో ఇబ్బంది పడుతున్న విజయ్ నైవేలీ లిగ్నెైట్ కార్పొరేషన్ దగ్గర షూటింగ్ లో పాల్గొనగా బీజేపీ  శ్రేణులు వచ్చి అడ్డుకోవడం మరింత దుమారం రేపుతోంది. అయితే గనులు దగ్గర షూటింగ్ కు ఎలా పర్మిషన్ ఇస్తారని నిలదీశారు బీజేపీ కార్యకర్తలు.  భారీగా పోలీసులు మోహరించారు. విజయ్ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ బీజేపీ గొడవ ఇంతటితో ఆగుతుందా.. ఇంకా ముదురుతుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ ఏడాది విజయ్ కి చాలా కష్టాలు వచ్చాయని అంటున్నా ఫ్యాన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: