తెలుగు ఇండస్ట్రీలో హీరోల మద్య ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది.  ఏదైనా చిత్రం రిలీజ్ అయితే.. ఆ మూవీ గురించి తమ అభిప్రాయాలు షేర్ చేస్తూ.. ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఎంకరేజ్ చేస్తుంటారు.  ముఖ్యంగా ఈ తరం యంగ్ హీరోలు సోషల్ మీడియాలను బాగానే వాడుకుంటున్నారు.  తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన మూవీ గురించి ఫన్నీగా ఓ పోస్ట్ పెట్టడం..దానికి హీరో విష్ణు ఫన్నీగా కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయానికి వస్తే.. సుబ్బు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘సోలో బతుకే సో బెటరు’ .  ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ సరసన అందాల భామ నభా  నటేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

 

'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.  లైఫ్ లో సోలోగా ఉంటే ఆ ఆనందమే వేరు అనే క్రమంలో ఓ పోస్ట్ పెట్టాడు.  దీనికి వెంటనే మంచు విష్ణు స్పందించారు. తమ్ముడూ సాయిధరమ్ తేజ్, నువ్వింకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో నేనూ చూస్తా" అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. "నీ ట్వీట్ ను సేవ్ చేసుకున్నా.

 

సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా" అంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. అయితే మంచు విష్ణు ట్విట్ చూసిన సాయిధరమ్ తేజ్ వెంటనే స్పందిస్తూ..  "విష్ణు అన్నా, నీలా ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కాలేరన్నా!" అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ ఇద్దరు యంగ్ హీరోలు తమ ట్విట్స్ తో మంచి చెడు మాట్లాడుతూనే.. సోలో బతుకు సో బెటరు మూవీకి అప్పుడే ప్రమోషన్లు మొదలు పెట్టేశారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: